హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: బీసీలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్.. ఒక్కరోజు ముందుగానే మరో భారీ కార్యక్రమం

CM Jagan: బీసీలపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్.. ఒక్కరోజు ముందుగానే మరో భారీ కార్యక్రమం

ఏపీ సీఎం వైఎస్ జగన్ (File Photo)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (File Photo)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికల మూడ్ లో ఉన్నారు. అందులో భాగంగా చాలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే బీసీ ఓట్లు చాలా కీలకం అని గుర్తించారు.. అందుకే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికలపై ఫోకస్ చేశారు.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. మరో 30 ఏళ్లు తనదే అధికారం అనే గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో చాలా దూకుడుగా వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే సీఎం చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని నిర్ణయాలు ఎన్నికల వ్యూహాలను గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో కీలక మార్పులు చేశారు. అధికారుల నియమాకల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుని.. ఎన్నికల టీంను సిద్ధం చేసుకున్నారు. అక్కడితోనే ఆగలేదు.. వరుసగా నియోజకవర్గ రివ్యూలు చేస్తూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. అలాగే ఈ సారి టీచర్ల నుంచి భారీ ఎత్తున వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందే గ్రహించి.. వారిని ఎన్నికల విధులకు దూరం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఎన్నికలకు సంబంధించే ఉంటోంది. తాజాగా బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలి అంటే బీసీ ఓట్లు కీలకం అన్నది వైసీపీ పెద్దల అంచనా.. అందుకే బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు..

ఇందులో గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు అందరు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. నామినేటెడ్ పోస్టులో ఉన్న బీసీ నేతలు, పార్టీలోనే వివిధ విభాగాల్లో ఉన్న బీసీ నాయకులు పాల్గొనబోతున్నారు.. ఇక, 7న నిర్వహించనున్న సభకు జయహో బీసీ మహాసభగా నామకరణం చేశారు.. వెనుకబడిన కులాలే వెన్నెముక టాగ్ లైన్ పెట్టారు. 15 నుంచి 20 మంది వరకు బీసీ మంత్రులు, ఎంపీలు వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం ఉంది. వారందరికీ ఐదు నుంచి పది నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అంటే ఒక్కొక్కరిగా..

వారందరి ఉపన్యాసాలు ముగిసిన తరువాత.. అంతే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బీసీ నేతలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది.. అలాగే గురువారం ఉదయం 11 గంటలకు స్టేడియంను పరిశీలించనున్నారు బీసీ మంత్రులు, నేతలు.. జయహో బీసీ మహాసభ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు.. సభ నిర్వహణకు మూడు కమిటీల ఏర్పాటు చేశారు.. అకామిడేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పార్థసారథి, ట్రాన్స్‌పోర్టు కమిటీ అధ్యక్షుడు చిన్న సీను, ఫుడ్ కమిటీ అధ్యక్షుడుగా మంత్రి కార్మూరు నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి సదస్సులో ఉండే అవకాశం ఉందంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu

ఉత్తమ కథలు