CM Jagan: మాండూస్ తుఫాను (Mandous Cyclone) ప్రభావంతో ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో మరో తుఫాను ముంచుకొస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ముంచుకొస్తున్న మరో తుఫాను.. ఈసారి ఎక్కడంటే బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో రేపు ఏర్పడనున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని కారణంగా ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోమారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందాల్సి వస్తోంది. శ్రీలంకను ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మాండూస్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. మాండూస్ ఎఫెక్ట్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు తీవ్ర పంట నష్టాన్ని చూశారు. ఈ నేపథ్యంలోమాండూస్ తుపాను, భారీ వర్షాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్లు, అధికారులు అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.
అలాగే ఎక్కడిక్కకడ నష్టాన్ని అంచనా వేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడా రైతులు నిరాశకు గురికాకూడదని దిశానిర్దేశం చేశారు. రంగుమారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయకూడదన్న మాట ఎక్కడా వినిపించకూడదు అన్నారు. అలాగే తక్కువ రేటుకు కొంటున్నారన్న మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి : అన్ స్టాపబుల్-2 సెట్ కు ఇంటి భోజనం పట్టుకొచ్చిన ప్రభాస్ .. బాలయ్యకు ఇష్టమైన వంటకాలు ఇవే..
ఒకవేళ రైతులు బయట అమ్ముకుంటున్నా వారికి రావాల్సిన రేటు వారికి రావాలని, ఆ రేటు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసిన జిల్లాల కలెక్టర్లందరూ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు దెబ్బతిన్న చోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే, ఆ కుటుంబానికి 2 వేల రూపాయల నగదు, రేషన్ అందించాలని తెలిపారు. ఇంట్లోకి నీళ్లు వచ్చినా గానీ, ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట రాకూడదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Cyclone alert, Heavy Rains