Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRAESH MINSTERS WILL GO BUS YATRA FOR ALL DISTRICTS THIS MONTH ENDING NGS

Minsters tour: గడప గడపకు బ్రేక్.. ఇక మంత్రుల బస్సు యాత్ర.. ఎప్పటినుంచి అంటే?

సీఎం జగన్ తో మంత్రి గుడివాడ అమర్ నాథ్

సీఎం జగన్ తో మంత్రి గుడివాడ అమర్ నాథ్

AP Minsters Tour: వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన గడప గడపకు ప్రభుత్వానికి బ్రేకులు పడతాయా..? మరో కొత్త ప్లాన్ ను సీఎం జగన్ సిద్ధం చేశారా.? మంత్రులు ఇకపై బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారా..? సడెన్ గా ఈ యాత్ర ఫిక్స్ చేయడానికి కారణం ఏంటి..? ఎప్పటి నుంచి వెళ్తారంటే..?

ఇంకా చదవండి ...
    AP Minsters Tour:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ (Election Heat) కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ జనం జపం చేస్తున్నాయి. నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటు అధికార పార్టీ.. అటు విపక్షాలు సైతం ఇకపై ప్రజల్లోనే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇతర పార్టీలతో పోల్చుకుంటే అధికార వైసీపీ మరింత దూకుడుగా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగేలా..? సీఎం జగన్ (CM Jagan) వారికి టార్గెట్లు పెట్టారు. ఇందులో  భాగంగా గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటే..  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర  ప్రజా ప్రతినిధులు.. జనంలోకి వెళ్తున్నారు. అయితే మొదట దీన్ని గడప గడపకు వైసీపీ అంటూ.. కేవలం ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది. మెరుగుపరుచుకోడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టారు. కానీ చివరి నిమిషంలో పేరు మార్చారు సీఎం జగన్.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనపై జనం మనసులో మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు మరో వ్యూహం సిద్ధం చేస్తున్నారు సీఎం జగన్.. అధినేత ఆదేశాలతో మంత్రులు బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు.

    సామాజిక న్యాయం పేరుతో ఈ బస్సు యాత్ర  చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  శ్రీకాకుళం (Srikakulam), రాజమండ్రి (Rajahmundry), నరసరావు పేట (Narasarao Peta), అనంతపురం (Anantpuram)లో సభలు నిర్వహించే యోచన చేస్తోంది. ముఖ్యంగా  ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, మంత్రులతో ఈ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అది కూడా ఈ నెలలోనే..  ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రతో గడప గడపకు ప్రభుత్వానికి బ్రేక్ ఇస్తారనే ప్రచారం మొదలైంది.

    ఇదీ చదవండి : 6 ఏళ్లకే పోలియో.. ఇప్పుడు రూ. 25కోట్ల టర్నోవర్‌ బిజినెస్‌..! ఎలా సాధ్యమైందంటే?

    ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా గడప గడపకు వైసీపీ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు ఎమ్మెల్యేలు అంతా.. తమ మేనిఫెస్టో పట్టుకుని మరి  ప్రజల్లోకి వెళ్తున్నారు.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..? పథకాలపై ఆనందంగా ఉన్నారా.. ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని  ఆరా తీస్తున్నారు. అయితే అలా వెళ్తున్న నేతలకు కొన్ని చోట్ల నిరసన సెగలు తప్పడం లేదు.

    ఇదీ చదవండి : అయ్యో పాపం.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ముప్పై ఏళ్లుగా నడిరోడ్డు మీదే జీవనం..! ఎందుకంత కష్టం?

    ముఖ్యంగా ఉచిత పథకాలు ఎందుకని.. రోడ్లు బాగుచేయాలని కొందరు.. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కొందరు..? మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని మరి కొందరు ఇలా మంత్రులను నేతలను నిలదీస్తున్నారు. మరికొందరు తమకు పథకాలే అందడం లేదని ప్రశ్నిస్తారు.. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఎదురువుతున్నాయి.. అయితే అధికార పార్టీ ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండదు..

    ఇదీ చదవండి : మూడు పార్టీలు ఫిక్స్ అయ్యాయా..? రెబల్ ఎంపీ సేఫ్ జోన్ లో ఉన్నారా..? త్రిముఖ వ్యూహం ఇదేనా..?

    ఇలా ఓ వైపు మంత్రులు గడపగడపలో బిజీగా ఉంటే.. సడెన్ గా మంత్రుల బస్సు యాత్ర ప్లాన్  చేశారు అంటే.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ ముందునుంచి సామాజిక లెక్కలు వేసుకుంటున్నారు. పదవుల విషయంలోనూ అదే సూత్రం ఫాలో అవుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ  గెలవాలి అంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  ఓట్లే కీలకం అని అధినేత భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆ పేరుతో బస్సు యాత్రలు చేపట్టినట్టు సమాచారం.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు