హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News To Villagers: గ్రామస్తులకు సీఎం గుడ్ న్యూస్.. అధికారికంగా ఉత్తర్వులు జారీ

Good News To Villagers: గ్రామస్తులకు సీఎం గుడ్ న్యూస్.. అధికారికంగా ఉత్తర్వులు జారీ

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

Good News To Villegers: సంక్షేమ పథకాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల విషయంలో ఎన్నో మార్పులు చేస్తున్నారు. పేదలకు విద్యను వైద్యాన్ని దగ్గర చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Good News To Villegers: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.. ముఖ్యంగా పేదలకు వైద్యాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో అడుగు ముందుకు వేశారు. గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అలాగే మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్‌ / ప్రభుత్వ సేవలను తప్పనిసరి చేసింది.

  ప్రభుత్వ కళాశాలల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్‌ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక సంవత్సరం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. దీనికి సంబంధించి వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

  2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్‌లు పొందే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్‌ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకుంటారు. నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులు కోర్సు అనంతరం సంవత్సరం పాటు రూరల్‌/ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే వారికి భారీగా జరిమానాలు కూడా వేస్తారు.

  ఇదీ చదవండి : దసరాకు పూజించే జమ్మి చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

  ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్‌ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్‌లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌లు పొందనున్న వీరందరూ 2025–26లో కోర్సులు పూర్తి చేసుకుంటారు.

  ఇదీ చదవండి : రైతులకు బిగ్ అలర్ట్.. ఆ పథకాలు పొందాలి అంటే.. ఈ నెల 12 వరకే గడువు.. కేవైసీ ఇలా చేసుకోండి

  మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు ఇప్పటికే డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్‌–సర్వీస్‌ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్‌ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

  ఇదీ చదవండి : 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

  మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్‌–సర్వీస్‌ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్‌ తీసుకోవాలని తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు