హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఆ కుటంబాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. నవంబర్ లో వారందరికీ ఉద్యోగలిస్తామని హామీ ఇచ్చారు

CM Jagan: ఆ కుటంబాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. నవంబర్ లో వారందరికీ ఉద్యోగలిస్తామని హామీ ఇచ్చారు

 ఆ కుటుంబాలకు సీఎ జగన్ గుడ్ న్యూస్

ఆ కుటుంబాలకు సీఎ జగన్ గుడ్ న్యూస్

CM Jagan: ఏపీ ప్రజలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కీలక అడుగు ముందుకు పడింది. అలాగే ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారికి ఇప్పటికే ఉద్యోగులు కూడా ఇచ్చారు. మిగిలి కుటుంబాలకు నవంబర్ లో ఉద్యోగులు ఇచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కీలక అడుగు ముందుకు పడింది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం (Krishnapatnam) లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో 800 మెగావాట్ల యూనిట్‌ను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్‌ క్రిటికల్‌ యూనిట్‌ రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

సాధారణ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీని కారణంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తిలో మరో ముందడుగు పడిందని ముఖ్యమంత్రి అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. తన తండ్రి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు.

మరోవైపు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని సీఎం సాకారం చేశారు. చేపల వేటకు అనువుగా 25 కోట్ల రూపాయల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఫిషింగ్‌ జెట్టికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే..? జనసేనాని ఫిక్స్ అయ్యారా..?

తన తండ్రి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని జగన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్‌కో మూడో యూనిట్‌ను సీఎం ప్రారంభించిన తరువాత.. కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా 25 కోట్ల రూపయల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు.

ఇదీ చదవండి: కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన శివాలయం.. నిమ్మచెట్టునే శివలింగంగా ప్రతిష్టించిన ధర్మరాజు..! ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబాల్లో ఇప్పటికే 326 కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. మరో 150 కుటుంబాలకు నవంబర్‌లో ఉద్యోగాలు ఇస్తామన్నారు. గతంలో ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అలాగే 16,218 మత్స్యకారేతర కుటుంబాలకు 35.74 కోట్ల సాయం అందించాం. స్థానికుల కోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టీ నిర్మిస్తున్నామన్నారు. ప్రజలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశామన్నారు సీఎం జగన్ .

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News

ఉత్తమ కథలు