AP POLITICS ANDHRA PRADESH TELIMEDICES GEETING NUMBER ONE AWARD FROM CENTRAL GOVRNMENT NGS
AP No 1: ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్.. కేంద్రం నుంచి ప్రశంసలు
సీఎం జగన్ (పాత ఫొటో)
AP No 1: సంక్షేమ పాలనలో జగన్ తనదైన మార్క్ వేసుకున్నారు. బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి వివిధ పథకాల రూపంలో అండగా నిలుస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యంపైనా అధికంగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా ఆ రంగంలో ఏపీ నెంబర్ వన్ అంటూ కేంద్రం కొనియాడింది.
AP No 1: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంక్షేమ సీఎంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముందునుంచి ఆయన చెబుతున్నట్టు నవరత్నాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు, బడుగు బలహీన వర్గాలకు, ఆర్థిక స్థోమత లేని వర్గాలకు ఆయన పలు సంక్షేమ పథకాలు (Warfare scheme) ప్రవేశ పెట్టారు. ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు.. విద్యా, వైద్య రంగంలో సమూల మార్పులకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా వైద్య సేవల్లో ఏపీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే పట్టుదలతో సీఎం కనిపిస్తున్నారు. అందులో భాగంగా టెలీమెడిసిన్ సేవల్లో (Tele Medicen Services ) , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చారు. తాజాగా వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ఇప్పటికే పలు వైద్య సేవలు ఉచితంగా అందించే ప్రతయ్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీంతో పాటు ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు కింద ఆరోగ్య ఉపకేంద్రాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లుగా అభివృద్ధి చేసింది. అదేవిధంగా పీహెచ్‌సీల్లోనూ వసతుల కల్పన చేపట్టింది. పట్టణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రాష్ట్రంలో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6,313 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. వంద శాతం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. ఏపీ ప్రభుత్వం గతంలోనే వీటికి శ్రీకారం చుడితే.. ఇప్పుడు ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ ఏడాది ఆఖరు నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది.
పీహెచ్ సీల్లో గతంలో కేవలం ప్రాథమిక వైద్యసేవలను మాత్రమే అందించేవారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చిన తరువాత.. వీటిలో అన్ని రకాలన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నారు. ఇక వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు కొనసాగుతున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సమగ్ర మాతా–శిశు సంరక్షణ సేవలు, ప్రసూతి సేవలు, మానసిక వైద్యసేవలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత, కంటి, చెవి, ముక్కు, గొంతు సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలతోపాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను టెలీమెడిసిన్ హబ్‌లకు అనుసంధానం చేశారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటి నుంచే టెలీమెడిసిన్ సేవలు పొందేందుకు వీలుగా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.