హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP vs YSRCP: పట్టాభిపై దాడి వెనుక మంత్రి హస్తంపై టీడీపీ అనుమానాలు.., బెజవాడలో పొలిటికల్ టెన్షన్

TDP vs YSRCP: పట్టాభిపై దాడి వెనుక మంత్రి హస్తంపై టీడీపీ అనుమానాలు.., బెజవాడలో పొలిటికల్ టెన్షన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy Pattabhi) పై దుండుగుల దాడి వ్యవహారం విజయవాడలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభిపై దుండుగుల దాడి వ్యవహారం విజయవాడలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈరోజు (ఫిబ్రవరి 2) ఉదయం దుండగులు పట్టాభిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పట్టాభి కారు ద్వంసం కాగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాడి విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు పట్టాభి నివాసం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేంగా నినాదాలు చేశారు. వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముంత్రులే ఈ దాడి చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేశారని.. గతంలో ఓ సారి దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. కార్యక్తలు భారీగా తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్టాభిని పరామర్శించి దాడి జరిగిన విధానాన్ని అఢిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్.. తన బూతుల మంత్రులతో పట్టాభిపై దాడి చేయించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మంత్రులే ఈ దాడి చేయించి ఉంటారని పరోక్షంగా మంత్రి కొడాలి నానిపై ఆరోపణలు చేశారు. ప్రశ్నించిన వారందరికీ చంపేస్తారా..? అయితే నన్నూ చంపేయండంటూ ఆవేశంగా మాట్లాడారు. వీళ్ల అరాచకాలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మంత్రి కొడాలి నాని అనుచరులే తనపై దాడి చేశారని పట్టాభి కూడా ఆరోపించినట్లు తెలుస్తోంది.

  ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. టీడీపీ నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్న ఆయన.. రాజకీయ లబ్ధి కోసమే దాడి జరిగినట్లు నాటకమాడుతున్నారని ఆరోపించారు. తమపై తామే దాడి చేసుకోని ఆ నెపాన్ని వైసీపీపై నెడుతున్నారన్నారు మంత్రి నాని. ఇలాంటి చర్యలకు పాల్పడటంతో చంద్రబాబును కొట్టిన వాళ్లు లేరని.. ఆరోపించారు. ఇదో పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేశారు.

  మరోవైపు పట్టాభిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడె ప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ఉమాతో పాటు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, AP Politics, Bonda uma, Chandrababu Naidu, Devineni Uma Maheswara Rao, Kodali Nani, TDP, Telugu news, Vijayawada, Ysrcp

  ఉత్తమ కథలు