Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH SPEAKER TAMMINENI SEETHARAM COUNTER TO OPPOSITE PARTIES ON PLENARY MEETING NGS GNT

AP Speaker: ఏపీ స్పీకర్ తీరుపై విమర్శలు.. కోడెలకు ఒక రూల్.. తనకో రూలా అంటూ ప్రశ్నించిన తమ్మినేని

విపక్షాలపై స్పీకర్ తమ్మినేని ఫైర్

విపక్షాలపై స్పీకర్ తమ్మినేని ఫైర్

AP Speaker: ఏపీ ఆంధ్ర్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని తీరు మరోసారి వివాదాస్పదమవుతోంది. అయితే తనపై వస్తున్న విమర్శలకు ఆయన అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.. నాడు కోడెల శివప్రసాద్ కు ఒక రూలు.. ఇప్పుడు తనకో రూల్ నా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను మొదట వైసీపీ ప్రాథమిక సభ్యుడిని అని.. తరువాతే ఎమ్మెల్యే అయినా.. స్పీకర్ అయినా అంటున్నారు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    AP Speaker: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) స్పీకర్ తమ్మినేని సీతారం (Speaker Tammineni Seetharam) వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  (YSR Congress Party) నిర్వహిస్తున్న ప్లీనర్ లో ఆయన పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు.. సభలో ఓ రాజకీయ నేతలా మాట్లాడుతూ.. విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. స్పీకర్ స్థానంలో ఉండి ఆయన.. ఓ పార్టీ నేతలా ప్లీనరీలో ఇస్టాను సారం మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్లీనరీ భాగంగా పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై చర్చను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లిన సీఎం జగన్ (CM Jagan) నామస్మరణే వినిపిస్తోందన్నారు. ప్రతి గడప జగన్ కోసం ఎదురు చూస్తోంది అన్నారు. మళ్లీ జగన్ ను భారీ మెజర్టీతో గెలిపించుకోవాలని ఏపీ ప్రజలు సిద్ధమయ్యారని.. విపక్షాలకు అన్ని దారులు మూసుకుపోయాయి అన్నారు. సీఎం జగన్ పరిపానలో ఈ మూడేళ్ల ప్రగతిపై సమీక్షకే ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ప్లీనరీకి భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారని తెలిపారు. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యంను సీఎం జగన్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలు విమర్శలు చేసే వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

    స్పీకర్ స్థానంలో ఉండి.. ఇలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు తమ్మినేని.. గత తెలుగు దేశంలో నిర్వమించిన మహానాడులో ఆనాటి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. తాను వైసీపీ ప్లీనరీలో పాల్గొంటే తప్పేంటి అని ఎదురు ప్రశ్ని వేశారు..? తాను మొదట వైసీపీ ప్రాథమిక సభ్యుడినని.. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా.. ఇప్పుడు స్పీకర్‌ అయినా అంటూ సమాధానం చెప్పారు. పార్టీకి సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం అయిన ప్లీనరీ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చొవాలా అంటూ విమర్శలు చేస్తున్నవారిపై మండిపడ్డారు.



    ఇంకా ఆయన ఏమన్నారంటే.. జగన్ నాయకత్వంలో వైసీపీ 175 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు భగవంతుడు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మరోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజల్లో ఇప్పటికే భయం మొదలైంది అన్నారు. ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రగతి కోసం, అభివృద్ది కోసం జగన్ నిర్విరామంగా కష్టపడుతున్నారని గుర్తు చేశారు.
    ఇదీ చదవండి : అమర్‌నాథ్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. చర్యలకు సీఎం ఆదేశాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..

    రాష్ట్రానికి టార్చ్ బెరర్‌గా జగన్ ఉండాలని ఆకాంక్షించారు. జగన్ వెంట కలిసి నడిసేందుకు తాము అందరం సిద్దంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో వైసీపీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ఇలా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనని.. ఇకపై పార్టీ ప్రతి కార్యక్రమానికి తాను హాజరై తీరుతానని చెప్పారు. జై జగన్.. జై జై జగన్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Speaker Tammineni Seetharam, Ysrcp

    తదుపరి వార్తలు