హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: ఫేక్ లా సర్టిఫికేట్ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని క్లారిటీ..? ఆయన ఏమన్నారంటే..?

Breaking News: ఫేక్ లా సర్టిఫికేట్ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని క్లారిటీ..? ఆయన ఏమన్నారంటే..?

స్పీకర్ తమ్మినేని సీతారాం (ఫైల్ ఫోటో)

స్పీకర్ తమ్మినేని సీతారాం (ఫైల్ ఫోటో)

Breaking News: స్పీకర్ తమ్మినేని ఫేక్ లా సర్టిఫికేట్స్ వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.. ఈ విషయంలో తాను భయ పడడం లేదన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

Breaking News :  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార వైసీపీ (YCP) కి వరుస షాక్ లు తప్పడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏదో ఒక అంశం విపక్షాలకు ఆయుధంగా దొరుకుతోంది. ఇప్పటికే వరుసగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో (Graduate MLC Elections Result) మూడింటికి మూడు సీట్లు టీడీపీ (TDP) నెగ్గింది. ఆ తరువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో (MLA Qouta MLC Elections) బలం లేకపోయినా టీడీపీ నెగ్గింది. అంటే వైసీపీ పార్టీతో ఉన్న నేతలే టీడీపీ అభ్యర్థులను గెలిపించడం.. ఆ పార్టీ ఊహించని షాకే.. దిద్దుబాటు చర్యల్లో భాగంగా నలుగురు అనుమానిత ఎమ్మెల్యేలను పార్టీ పెద్దల బహిష్కరించారు. అయినా దుమారం ఆగడం లేదు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ప్రలోభాలకు గురి చేస్తోంది అంటూ నిరూపించాలనే లక్ష్యంతో.. తనకు పది కోట్లు ఆఫర్ చేశారంటూ ఆరోపించిన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. అదే సమయంలో ఆయన దొంగ ఓట్లపై చేసిన వ్యాఖ్యలు విపక్షాలు అస్త్రంగా మారింది. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ (Fake Degree Certificates) పై దుమారం రేగుతోంది.

అయితే ఫేక్ లా సర్టిఫికేట్ అరోపణలపై తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. సరైన సమయంలోనే  ఫేక్ సర్టిఫికేట్ల ఆరోపణలపై సమాధానం చెబుతాను అన్నారు. అయితే తప్పుడు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన.. త్వరలోనే పూర్తి వాస్తావాలు వెలుగులోకి వస్తాయి అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అసలు వివాదం ఏంటంటే..?

స్పీకర్ తమ్మినేన సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, కోటబోమ్మాళిలలో ప్రాధమిక విధ్యను అభ్యసించారు. ఇక శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విధ్యను అభ్యసించారు. తరువాత అదేవిదంగా డిగ్రీ (హెచ్ ఇసి) డిగ్రీ డిస్ కంటిన్యూ చేసినట్లు స్పీకర్ పలు టీవీ ఇంటర్వూల్లో ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఇదే అంశం పేర్కొన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఇంటర్ తరువాత లా చేయాలి అనుకుంటే ఐదేళ్ల కోర్సులో జాయిన్ అవ్వాలి. మరి డిగ్రీ పూర్తి కాకాకుండా మూడేళ్ల ఎల్ ఎల్ బీ కోర్సు కోసం ఎలా అడ్మిషన్ తీసుకున్నారన్నదానిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇదీ చదవండి : దొంగ ఓట్ల వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే.. అసలు జరిగింది ఏంటంటే..?

దీనిపై ఆదివారం నుంచి పంచాయతీ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఈ రోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సర్టిఫికేట్ల ఆరోపణలు ఎలా వచ్చాయి? అసలు డిగ్రీ చేయకుండా..? ఎల్ ఎల్ బీ అడ్మిషన్  తీసుకున్నారా..?  వాస్తవం ఏంటి అన్నదానిపై ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సరైన సమయంలో దానిపై సమాధానం చెబుతాను అన్నారు.  తాను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతాని ప్రశ్నించారు. విపక్షాలు మాత్రం.. స్పీకర్ తీరును తప్పుపడుతున్నాయి. ఫేక్ సర్టిఫికేట్ల వార్త నిజం.. కాకపోతే ఆయన పూర్తిగా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, AP Speaker Tammineni Seetharam

ఉత్తమ కథలు