AP Rajyasabha Members: సుదీర్ఘ కసరత్తు తరువాత ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ప్రస్తుతం ఖాళీ అవుతున్న స్థానాల్లో.. ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy)ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన మూడు స్థానాల్లో.. ఇద్దరు బీసీ, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తో పాటు, ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) , సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది.. .మెగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి (Niranjan Reddy), మరొకటి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీద మస్తాన్ రావు (Beeda Masthan Rao) ల పేర్లను సీఎం ఫైనల్ చేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల (Sajjala), సుబ్బారెడ్డి (Subbareddy), విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) లతో సుదీర్ఘ భేటీ తరువాత ఈ నలుగుర్ని ఫైనల్ చేశారు సీఎం జగన్..
అయితే ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావుల ఎంపికపై ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆర్ కృష్ణయ్య టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్నారు.. అదీ కాకా ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి.. దీంతో ఏపీలో బీసీ అభ్యర్థులే లేరా.. తెలంగాణ వ్యక్తికి ఎందుకు పదవి ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక నిరంజన్ రెడ్డి సైతం తెలంగాణకు చెందిన వ్యక్తే.. దీనికి తోడు బీద మస్తాన్ రావు బీసీ అభ్యర్దే అయినా.. ఆయన కూడా గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా బీజీ అభ్యర్థులు ఇద్దరూ బయట వ్యక్తులే కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి : గడప ముందుకొచ్చిన రోజా.. పెళ్లి చేయమన్న వృద్ధుడు.. మంత్రి రియాక్షన్ ఇదే
తెలంగాణ వ్యక్తులను రాజ్యసభకు ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలకు మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థులు అంటే.. జాతీయ స్థాయిలో పని చేస్తారని అన్నారు. రాజ్యసభకి తెలంగాణ, ఆంధ్ర అనేది ఉండదన్నారాయన. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆర్ కృష్ణయ్యకి సీఎం జగన్ రాజ్యసభ అవకాశం ఇచ్చారని అన్నారు. జాతీయ స్థాయిలో బీసీల వాయిస్ ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అని, ఆయనకి తెలంగాణ, ఆంధ్ర అనే బేధం లేదని మంత్రి బొత్స చెప్పారు.
ఇదీ చదవండి : మళ్లీ తెరపైకి సత్యం బాబు.. ఆ పని చేయండి ప్లీజ్ అంటూ ప్రభుత్వానికి వినతి
మరోవైపు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. బీసీలకు పెద్ద పీట వేయడమే తమ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇప్పటికే చాలా పదవుల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద పీట వేశారని.. మరోసారి అదే రుజువు చేశారన్నారు. బీసీలు అంటే అనగారిన వర్గాలు కాదని.. నిరూపిస్తూ.. వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని ఆయన గుర్తు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Rajyasabha, Vijayasai reddy