Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICS NARA LOKESH FOLLOWERS START ANNA CANTEEN WHEN GOVERNMENT OPPOSED NGS GNT

Mangalagiri: మంగళగిరిలో టీడీపీదే విజయం.. పంతం నెగ్గించుకున్న నారా లోకేష్.. ఏం జరిగిందంటే..?

నారా లోకేష్

నారా లోకేష్

Mangalagiri: గత ఎన్నికల్లో ఓటమి పాలైన చోటే వెతుక్కునే పనిలో పడ్డారు లోకేష్.. అందుకే మంగళగిరిపై ఫోకస్ చేస్తున్నారు. పదే పదే అక్కడ పర్యటిస్తున్నారు. తాజాగా అన్నాక్యాంటీన్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు.. అక్కడితోనే ఆగలేదు పంతం నెగ్గించుకున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే..?

ఇంకా చదవండి ...
    Mangalagiri: గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరి (Mangalagiri) మళ్లీ వార్తల్లో నిలిచింది. గత ఎన్నికల్లో నారా లోకేష్ (Nara Lokesh) అక్కడ పోటీ చేసి ఓడిపోవడంతో.. మంగళగిరి ప్రత్యేకంగా నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అక్కడ నుంచే పోటీ చేయాలని లోకేష్ ఫిక్స్ అయ్యారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అందర్నీ కలుస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమితో సానుభూతి.. స్థానిక ఎమ్మెల్యేపై వ్యతరేకత ఈ సారికి తనకు వస్తాయని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్ట పడడం లేదు. తాజాగా అన్న క్యాంటీన్ (Anna Canteen) వివాదాన్ని సైతం అనుకూలంగానే చేసుకున్నారు. మొదట మంగళగిరిలో క్యాంటీన్ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చేసిన చోటే క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టెంట్ వేసిన తెలుగుదేశం నేతలు (Telugu Desam leaders).. పేదలకు రెండు రూపాయలకు భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేవంటూ పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

    అయితే గురువారం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మున్సిపల్‌ సిబ్బంది తొలగించడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలగించిన చోటే క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామని టీడీపీ నేతలు మళ్లీ ప్రకటించడంతో అక్కడి ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర శుక్రవారం భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పెద్దఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత టెంట్‌కు అన్న క్యాంటీన్‌ బ్యానర్లు కట్టి అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. మొత్తానికి తమ పంతం నెగ్గించుకున్నారు.



    ప్రభుత్వం తీరుపై తెలుగు దేశం నేతలు భగ్గుమంటున్నారు. పేదలకు అన్నం పెడతామంటే ప్రభుత్వానికి ఎందుకంత కడుపుమంట అని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. పేదల పొట్టకొట్టేలా అన్న క్యాంటీన్‌ తొలగింపు సిగ్గు చేటని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే అత్యుత్సాహంతోనే మున్సిపల్ అధికారులు, పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

    ఇదీ చదవండి : అలనాటి అందాలతార ఫోకస్ ఏపీపైనే.. గోదావరి జిల్లాల్లో కర్చీఫ్ వేస్తున్నారా?

    నందమూరి బాలకృష్ణ జన్మదినం, స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ అధికారులు అడ్డుకోవడంతో తెలుగు దేశం శ్రేణులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించింది. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిర్మాణాల్లో కొన్నింటిని వైసీపీ ప్రభుత్వం కూల్చి వేసింది. మరికొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చింది. అయితే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని టీడీపీ ఎప్పటి నుంచో పట్టుబడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన సతీమణి వసుంధర స్వయంగా అన్న క్యాంటీన్ ప్రారంభించారు.

    ఇదీ చదవండి : సినిమాలకు పవన్ గుడ్ బై.. జనసేనాని వ్యూహం అదేనా..?

    ఆ తర్వాత గుంటూరులోనూ టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లు తమ సొంత నిధులతో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో గురువారం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నిర్మాణం కొంత వివాదానికి దారితీసింది. అనుమతులు లేకుండా నిర్మించారంటూ అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అడ్డుకున్నా టీడీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకులు శుక్రవారం మళ్లీ అన్న క్యాంటీన్ ప్రారంభించగలిగారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Gunturu, Mangalagiri, Nara Lokesh

    తదుపరి వార్తలు