AP POLITICS ANDHRA PRADESH POLITICS BROTHER ANIL SENSATIONAL COMMENTS ON CM JAGAN AND HE CONDUCT MEETING IN VIZAG NGS GNT
YS Sharmila Party: సీఎం జగన్ పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు.. పార్టీ దిశగా వేగంగా అడుగులు
వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ (ఫైల్)
YS Sharmila Party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై షర్మిల ఫోకస్ చేస్తోందా..? త్వరలో పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తోందా..? ఆ బాధ్యతను భర్త అనిల్ కు అప్పచెప్పిందా..? లేక ఆయనే పార్టీ పెట్టించే ఏర్పాట్లు చేస్తున్నారు.. సీఎం జగన్ పై ఆయన సంచలన వ్యాఖ్యల సంకేతం ఏంటి..? ఏది ఏమైనా.. ప్రస్తుతం ఏపీలో వరుస పరిణామాలు చూస్తుంటే.. పార్టీ పెట్టడం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కు ఇంటి పోరు తప్పదా..? ఒకప్పుడు అన్న విసిరిన బాణంగా ఏపీలో ప్రచారం చేసినా.. చెల్లే ఇప్పుడు విమర్శల బాణాలు సంధించాలి అనుకుంటున్నారా..? తాజా పరిస్థితులను చూస్తే ఇలాంటి అనుమానాలు కలగడం సహజం.. ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల (YS Sharmila).. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారా..? అయితే ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా ఆమె సూటిగానే సమాధానం చెప్పారు. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా..? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని ఎక్కడా రూల్ లేదన్నారు. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నానని.. అందులో నడుస్తున్నాను అంటూ చెబుతూ.. భవిష్యత్తులో పార్టీ పెట్టే అవకాశం ఉందనే సంకేతాలు కూడా ఇచ్చారు. తాజాగా పరిణమాలు చూస్తుంటే ఆమె పార్టీ పెట్టడం పక్కా అనే సంకేతాలే అందుతున్నాయి.
ఎందుకంటే షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో వరుస సమావేశాలతో బిజీ అయ్యారు. ఆ మధ్య ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అవ్వడం సంచలనంగా మారింది. ఆయన్ను మర్యాదపూర్వకంగానే కలిశానని.. ఆయన సలహాలు ఎప్పుడు తీసుకుంటామని బ్రదర్ అనిల్ వివరణ ఇచ్చారు. అక్కడితో ఆయన సమావేశాలు ఆగలేదు. సరిగ్గా వారం క్రితం బ్రదర్ అనిల్ విజయవాడలోని ఓ హోటల్లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఆ సందర్భంగా కొత్త పార్టీ పెడతామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేస్తే.. కనీసం మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదని ఆ సమావేశానికి హాజరైన బీసీ సంఘం నేత శొంఠి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశామన్న నాగరాజు.. త్వరలోనే తమకు శుభవార్త చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పారని వారు తెలిపారు.
ఇదే భేటీలో జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని బ్రదర్ అనిల్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం సమావేశం నిర్వహించడమే కాదు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సీఎం జగన్ ను కలిసి రెండేళ్లు అయ్యింది అన్నారు. వైసీపీ విజయానికి ప్రధానకారణమైన వర్గాలకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెట్టాలనే డిమాండ్ ఉంది. కానీ అది సాధారణ విషయం కాదన్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ బిజీగా ఉన్నారని.. అందుకే ఆయన్ను నేరుగా కలవాల్సిన పని లేదన్నారు. వైసీపికి ఓట్లు వేసి గెలిపించి.. ఇప్పుడు అన్యాయానికి గురి అవుతున్నవారి ఆవేదన వినేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నాని క్లారిటీ ఇచ్చారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.