హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు సీటు ఫిక్స్.. దొంగ ఓట్లపై వైసీపీ అలర్ట్

AP Politics: టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు సీటు ఫిక్స్.. దొంగ ఓట్లపై వైసీపీ అలర్ట్

విశాఖ టికెట్ పై క్లారిటీ

విశాఖ టికెట్ పై క్లారిటీ

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలతో బిజీ అయ్యాయి. ఇక అభ్యర్థులను ఫైనల్ చేయడంలోనూ దూకుడు పెంచుతున్నాయి. తాజాగా విశాఖలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

 Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18

AP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలతో బిజీగా ఉన్నాయి. ఇక అధికార వైసీపీ (YCP) అయితే అభ్యర్థులను సైతం ఖరారు చేస్తోంది. అలాగే టీడీపీ (TDP) ని ఓడించడానికి సకల అస్త్రాలు సిద్దం చేస్తోంది. తాజాగా దొంగ ఓట్ల నమోదుపై  అలర్ట్ అయ్యింది వైసీపీ. ఓటమి భయంతో ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desam) సాగిస్తున్న దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి (YV Subbareddy) హెచ్చరించారు. మద్దిలపాలెం లోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ సీపీ (YSRCP) దక్షిణ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయిలో తెలుగుదేశం నమోదు చేయిస్తున్న దొంగ ఓట్లను అడ్డుకుని ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

అలాగే అవినీతికి తావులేకుండా పథకాలు అందిస్తున్న వై.ఎస్.జగన్ మోహన్  రెడ్డిపై చంద్రబాబు , పవన్ కల్యాణ్ , పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మితే రాష్ట్రంలోని కోట్లాది మంది పేద ప్రజానీకం పథకాలకు దూరమైపోతారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి గురించి ఇంటింటికీ వెళ్లి తెలియజెప్పాలని, పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు.

రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ను గెలిపించాలని సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కార్యకర్తలు కంకణ బద్ధులై ఉండాలని కోరారు. పార్టీలో అంతర్గత సమస్యలుంటే నాలుగు గోడల మధ్య చర్చిద్దామని, దాని కోసం తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఇదీ చదవండి : జగన్ సర్కార్ కు షాక్.. గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. సంచలన వ్యాఖ్యలు

మరోసారి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి పార్టీ కేడర్ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సమావేశంలో పరిచయం చేశారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మాజీ శాసన సభ్యులు తైనాల విజయ్ కుమార్, రహిమాన్ వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు సీతంరాజు సుధాకర్, కోలా గురువులు,  తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గంటా రీ ఎంట్రీతో అయ్యన్న ఫైర్.. ఎవడయ్యా గంటా.. లక్షల్లో ఒక్కడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు

విశాఖలో వైసీపీకి ప్రజాబలం ఉందన్నారు.. అందుకే దానిని సరైన రీతిలో మలుచుకోవడానికి ఈ సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు నియామకం చేపట్టడం జరిగిందన్నారు. అందుకే  మీ అందరి దృష్టి లో ఉండాల్సిన ఏకైక లక్ష్యం జగన్ ను ముఖ్యమంత్రిగా చేయడమే అన్నారు.  

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Visakhapatnam, Yv subbareddy

ఉత్తమ కథలు