Pawan-RRR: ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..? అధికార వైసీపీకి కంటిలో నలుసులా తయారైన రెబల్ ఎంపీ రఘురామ రాజు (Raghu Rama Krishna raju).. ఫ్యూచర్ డిసైడ్ అయ్యిందా..? మొన్నటి వరకు ఆయన బీజేపీ (BJP) లో చేరుతారని.. దానిపై హామీ తీసుకున్న తరువాత.. వైసీపీ (YCP) అధిష్టానాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారని.. ప్రచారం ఉంది. ఆ వార్తలకు తగ్గట్టే ఆయన నిత్యం బీజేపీ కేంద్ర పెద్దలతో టచ్ లో ఉండేవారు..ఢిల్లీలోనే ఉంటు.. బీజేపీ నేతలతోనే ఎక్కువగా ప్రయాణం చేసే వారు. దీంతో ఆ ప్రచారం మరింత పెరిగింది. అంతే కాదు.. బీజేపీకి అన్ని విధాల సహకారం అందిస్తున్న వైసీపీ (YCP) .. జాతీయ స్థాయిలో రఘురామను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయించడానికి చాలా ప్రయత్నాలు చేసినా.. రఘురామ మాత్రం తనకు ఉన్న పరిచయాలతో.. వైసీపీ వ్యూహాలకు బ్రేకులు వేశారు. దీంతో ఆయన కషాయ కండువా కప్పుకోవడం లాంఛనమే అన్న అభిప్రాయం కలిగింది. కానీ మొన్న ప్రధాని మోదీ (Prime Minster Modi) భీమవరం (Bheemavaram) పర్యటన తరువాత.. రఘురామకు పూర్తి క్లారిటీ వచ్చింది అంటున్నారు. బీజేపీ అధిష్టానం జగన్ ను కాదని ఏమీ చేయదని ఆయనకు పూర్తిగా అర్థమైంది. దీంతో ప్రత్యామ్నాయాలపై రఘురామ ఫోకస్ చేశారు. అయితే తాజా పరిణామాలు చూస్తే.. ఆయన జనసేన గూటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ఆ ప్రచారానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలే.. భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రఘురామ రాజును వైసీపీ వేధిస్తున్నదంటూ.. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చాలా భాగం ఆవేదనను వినిపించారు. అక్కడితోనే పవన్ ఆగలేదు.. మరికొన్ని కీలకవ్యాఖ్యలు చేయడం.. ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
తాను భీమవరం పర్యటనలో ఎందుకు పాల్గొనలేదన్నదానిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఎంపీ తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే తనను పిలిచినా.. వెళ్లలేదు అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడి ఎంపీ రఘురాజును పిలవాలి.. కానీ అలా పిలవలేదు.. ఆయన రాకుండా ప్రభుత్వం అడ్డుపడింది. స్థానిక ఎంపీకి గౌరం లేని సభకు వెళ్లడం మర్యాద కాదని తాను వెళ్లలేదని వివరణ ఇచ్చారు. అంటే కేవలం రఘురామ రాజు కోసమే తాను వెళ్లలేదని పవన్ బహిరంగంగా చెప్పారంటే.. వారి మధ్య బంధం ఎలాంటిందో ఊహించుకోచ్చు.
ఇదీ చదవండి : చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీరు.. ఎందుకో తెలుసా..? ఎక్కడంటే..?
పవన్ కల్యాణ్ తో రఘురాజుకు సుదీర్ఘకాల సుదృఢ అనుబంధం ఉంది. పవన్ కల్యాణ్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ అయ్యే.. అనేక సందర్భాల్లో రఘురాజు ప్రెవేటు గెస్ట్ హౌస్ లోనే బస చేస్తారనేది డిల్లీ రాజకీయ వర్గాల్లో టాక్. అందుకే రఘురామ పై ఆయనకు అంత ప్రేమ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. రఘురాజు జనసేనలో చేరిక ఇంకా అధికారికంగా తేలకపోయినా.. రఘురాజు ఇటీవల వరుసగా పవన్ భజన చేస్తూ వస్తున్నారు. అందుకే ఆయన జనసేన పంచన చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, Powe star pawan kalyan