AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS YCP MP NANDIGAM SURESH ON PAWAN KALYAN AND KA PAUL NGS
YCP MP: పవన్ కళ్యాణ్ కంటే.. కేఏ పాల్ చాలా తెలివైన వ్యక్తి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ కంటే కేఏ పాల్ తెలివైన వ్యక్తా..?
YCP MP: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ వర్సెస్ జనసేన వార్ గా మారుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మంత్రులు, వైసీపీ నేతలు అంతా టార్గెట్ చేశారు. తాజాగా పవన్ ను కేఏ పాల్ తో కంపేర్ చేశారు.. పవన్ తో పోల్చుకుంటే.. కేఏ పాల్ తెలివితేటలు ఎక్కువ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
YCP MP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) - జనసేన (Janasena) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత కొంతకాలంగా రెండు పార్టీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దాడి చేస్తూ వస్తూన్నారు. పవన్ ను చంద్రబాబు నాయుడు (
Chandrababu Naidu) దత్తపుత్రుడు అంటూ సంబోధిస్తున్నారు. స్వయానా సీఎం జగన్ (CM Jagan) సైతం.. పవన్ ను దత్తపుత్రుడు అనే పిలుస్తున్నారు. ఇక మంత్రులు అయితే మరో అడుగు ముందుకు వేసి.. పవన్ కళ్యాణ్ తో దత్తపుత్రుడు అనే సినిమా తీస్తున్నామని.. కానీ ఆ సినిమాకు ఐదుగురు హీరోయిన్లను వెతకడమే కష్టంగా ఉంది అంటూ విమర్శలు చేశారు. సినిమా ఎవరు తీసినా దత్తపుత్రడు అట్టర్ ఫ్లాప్ కావడం పక్కా అంటూ విమర్శలు చేశారు. అయితే దానిక ధీటుగానే పవన్ కూడా స్పందిస్తూ వచ్చారు. తనను దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదని.. సీబీఐ పుత్రుడు అని పిలుస్తాను అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక జనసేన నేతలు అయితే.. ఏపీ మంత్రులతో రసిక రాజు సినిమా తీస్తామంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య ఫైట్ సాగుతుంటే.. తాజాగా వైసీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
ముఖ్యంగా జనసేన ఆరోపణలకు ఆయన తీవ్రంగా కౌంటర్లు ఇస్తున్నారు ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh).. తాజాగా మరోసారి కౌంటర్ల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్‌కు, కేఏ పాల్ (KA Paul)కు పెద్ద తేడా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. పవన్ కన్నా కేఏ పాల్ మేధస్సే ఎక్కువగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ వి పార్ట్ టైం పాలిటిక్స్ అని మండిపడ్డారు. చంద్రబాబు, లేదా ఆయన పార్టీ టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని, అంతే తప్ప ప్రజల గురించి పవన్ కు ఎప్పుడూ చింత ఉండదు అన్నారు.
జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అది చూసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఓర్చుకోలేక పోతున్నారని ఆరోపించారు. ప్రతీ పేదవాడు ఉన్నతంగా ఎదగాలని జగన్ పాటు పడుతుంటే, చంద్రబాబు మాత్రం తన బినామీలు బాగుంటే చాలనుకుంటాడని విమర్శించారు. ఇక లోకేష్ పిల్ల చేష్టలు చేస్తూ, రాజకీయాలు చేస్తున్నాడని ఎంపీ సురేశ్ ఎద్దేవా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ను పాల్ తో పోల్చడంపై.. జనసేన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.