హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR: వైసీపీ స్ట్రాటజీ మార్చిందా..? జూనియర్ ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టడానికి కారణం అదేనా..?

Jr NTR: వైసీపీ స్ట్రాటజీ మార్చిందా..? జూనియర్ ఎన్టీఆర్ ను లైన్ లో పెట్టడానికి కారణం అదేనా..?

జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

జూనియర్ ఎన్టీఆర్ (ఫైల్ ఫోటో)

Jr NTR: తిరిగి అధికారం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మరో స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ ను లైన్ లో పెడుతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Jr NTR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. దీంతో అప్పుడు ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) ప్రత్యర్థులకంటే దూకుడుగా.. దూసుకుపోతోంది. వ్యూహాలు రచించడంలో అన్ని పార్టీల కంటే జగన్ ముందున్నారు. ఇప్పటికే గడప గపడకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో పార్టీ నేతలంతా జనాల్లో ఉండేలా చూసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సర్వేలతో ఎమ్మెల్యేల రిపోర్ట్ కార్డు తెప్పించుకుంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వారిని అలర్ట్ చేస్తున్నారు. రిపోర్ట్ మెరుగుపడని వారికి సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు. సుమారు 75 మందికి ఈ సారి టికెట్లు ఉండవని సమాచారం అందుతోంది. ఇలా పార్టీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూనే ప్రత్యర్థలను ఓడించడం ఎలా అన్నిదానిపైనా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ను సైతం వైసీపీ లైన్ లో పెట్టిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

అసలు విషయం ఏంటంటే..? టాలీవుడ్ సత్తాను చాటి చెప్పిన మూవీ ఆర్ఆర్ఆర్ . ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీస్టారర్, పీరియాడికల్ మూవీ ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో NTRNominatedForOscar2023  అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ లేదా రామ్‌చరణ్‌లల్లో ఒకరు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ను అందుకోవడం ఖాయమంటూ అభిమానులు అంచనా వేస్తోన్నారు.

హాలీవుడ్ సినిమాలు, టీవీ షో, టాక్ షో, రియాలిటీ షోలకు సంబంధించిన సమాచారాన్ని అందించే వెరైటీ అనే వెబ్‌సైట్ ఈ మేరకు ఓ స్టోరీ కూడా ఇచ్చింది. 2023 ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికయ్యే సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ కూడా ఉందని పేర్కొంది. మూడు కేటగిరీల్లో ఇది ఎంపికైందని తెలిపింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (దోస్తీ), బెస్ట్ యాక్టర్ (రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఆర్ఆర్ఆర్ మూవీని సెలెక్ట్ చేసినట్లు ఆ కథనంలో చెప్పింది.

ఇదీ చదవండి : వైసీపీ నుంచి వచ్చేవారి కోసం.. టీడీపీలో 2 సీట్ల కేటాయింపు? ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు వ్యూహం అదేనా

ఇది తెలిసిన వెంటనే రామ్‌చరణ్, జూనియర్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎవరికి వారు తమ అభిమాన హీరో పేరును ట్రెండ్ చేస్తోన్నారు. NTRNominatedForOscar2023, RamcharanNominatedForOscar2023 హ్యాష్ ట్యాగ్స్‌పై వేలాది ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. వచ్చే సంవత్సరం మార్చి 12వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటామని చెబుతున్నారు.

ఇదీ చదవండి : పవన్‌ వీకెండ్ పొలిటీషియన్.. చిరంజీవినే తప్పు పడతారా అంటూ పేర్ని నాని ఫైర్

అందులో జూనియర్ హ్యాష్ ట్యాగ్ ను వైసీపీ సోషల్ మీడియా వారే అధికంగా ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డు కోసం ఎంపికైనట్లు కొన్ని హాలీవుడ్ మేగజైన్లలో చూశానని చెప్పారు. ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొందని అన్నారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయని, ఇది మన తెలుగు చిత్ర స్థాయిని చాటి చెబుతోందని పేర్కొన్నారు.

కేవలం వైసీపీ సోషల్ మీడియానే కాదు.. ఆ పార్టీ కీలక నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరం చేసుకోవడం కాకపోయినా.. కనీసం జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేయాలన్నదే వైసీపీ అసలు గేమ్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Jr ntr, OSCAR, Vijayasai reddy, Ycp

ఉత్తమ కథలు