AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS YCP ANNOUNCED 7 MEMBERS MLAS LIST THESE ARE THE LIST NGS
YCP MLA Candidates: ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు ఫస్ట్ ప్లేస్.. ఎన్నికలకు రెండేళ్ల ముందే 7 గురు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీవీ.. వారు ఎవరంటే..?
వచ్చే ఎన్నికల అభ్యర్థులు వీరే..
YCP MLA Candidates: అధికార వైసీపీ జెట్ స్పీడ్ వేగంతో వెళ్తోంది. ప్రతిపక్షాలకు అందని వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఓ వైపు ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతున్నా.. దానిపై స్పందించని అధికార పార్టీ.. అభ్యర్థులను కూడా ప్రకటించేస్తోంది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులను ఫైనల్ చేసింది.. అయితే అందులో పక్క పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేక ఫస్ట్ ప్లేస్ ఇఛ్చింది.
YCP MLA Candidates: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కచ్చితంగా ముందస్తు ఎన్నికలు తప్పవని.. అంతా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను నాయకులను రెడీ చేస్తున్నాయి. అయితే వైసీపీ (YCP) మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.. సైలెంట్ ఎన్నికల వ్యూహాలతో మందడుగులు వేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యే, మాజీలు అంతా గడప గడపకు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. మరోవైపు జిల్లాల వ్యాప్తంగా ప్లీనరీలతో పార్టీని పటిష్ట పరిచే చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రస్థాయి ప్లీనరికీ చక చకా ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఇదే సమయంలో.. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తూ వస్తోంది. పార్టీకి ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైనవారు నియోజకవర్గాల ప్లీనరీల్లో పాల్గొంటూ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్నవారు నిరాశకు గురవుతున్నారు. పార్టీలో గ్రూపులను నియంత్రించడానికి ముందుగానే పేర్లు ప్రకటించడంవల్ల ప్రయోజనం ఉంటుందని పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది.
ముఖ్యంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది వైసీపీకి మద్దతుగా నిలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వారి వారి స్థానాల్లోనే కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. వీరి నలుగురితో పాటు.. రాజోలు నుంచి జనసేన తరఫున గెలుపొంది వైసీపీకి మద్దతు పలుకుతున్న రాపాక వరప్రసాద్‌ను ఆ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా నియమించారు. కుప్పంలో చంద్రబాబునాయుడుమీద వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడతారని పలమనేరులో జరిగిన ప్లీనరీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
ఇలా ముందుగానే అభ్యర్థులపేర్లను ప్రకటించి అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలను ప్రాంతీయ సమన్వయకర్తలకు అప్పగిస్తున్నారు. అయితే తాను తెప్పించుకున్న సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా.. ఆ గ్రాఫ్ పెంచుకోవడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చేస్తున్న సర్వే ఆధారంగా ఈ ఏడాది అక్టోబరునాటికి అభ్యర్థుల పేర్లు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు నాలుగు నెలల సమయం ఇచ్చారు. ఈ సమయంలో వారు మెరుగుపడకపోతే కొత్తవారిని ఇన్‌ఛార్జిలుగా నియమిస్తారని తెలుస్తోంది. అక్టోబరు లేదా నవంబరు తర్వాత పార్టీలో కొత్త చేరికలు ఉండబోతున్నాయని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.