హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Central Minster: వైసీపీపై మా పార్టీ నేతల ప్రచారంలో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

Central Minster: వైసీపీపై మా పార్టీ నేతల ప్రచారంలో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

ప్రధాని మోదీతో సీఎం జగన్

ప్రధాని మోదీతో సీఎం జగన్

Central Minster: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ-కేంద్రంలో అధికార బీజేపీ మధ్య బంధం మరింత బలపడుతోందా..? కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. వైసీపీని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. జాతీయ స్థాయిలో కీలక నేతలు మాత్రం.. జగన్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ పై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం నిజం లేదని స్వయంగా కేంద్రమంతి చెప్పడంతో.. ఏపీ బీజేపీ నేతలు డిఫెన్స్ లో పడ్డారు.

ఇంకా చదవండి ...

  Central Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) పై రాష్ట్ర బీజేపీ నేతలు (BJP Leaders) విరుచుకుపడుతుంటారు. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా సర్కార్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. టీడీపీ (TDP), వైసీపీ (YCP) రెండు తమకు సమాన దూరమే అంటూ చెబుతంటారు. అందుకే అధికార పార్టీ పై తరచూ ఆరోపణలు చేస్తుంటారు.  వైసీపీ నుంచి మాత్రం అంత స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించదు. అందుకు కారణం కేంద్ర పెద్దలతో  సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కు ఉన్న సాన్నిహిత్యమే.. అది మరోసారి బయటపడింది. ఇక్కడ బీజేపీ నేతలు ఒక మాట అంటే.. కేంద్రంలో ఉండే పెద్దల వెర్షన్ వేరేలా ఉంటోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికల్లో (President Elections) తమ పార్టీ జాతీయ నాయకత్వం మద్దతు కోరలేదని చెప్పుకొచ్చారు. ఏ రకంగా చూసినా వైసీపీ తమకు అంటరానిదేనంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రుల వెనుక ఎక్కడో నిల్చొని ఫొటోల్లో కనిపిస్తూ తాము బీజేపీతో కలిసే ఉన్నామనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలది మైండ్ గేమ్ గా అభివర్ణించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతిచ్చి..ఆ తరువాత వైసీపీ భారత్ బంద్ కు మద్దతు తెలిపిందని ఆక్షేపించారు.

  అయితే ఆ ప్రాచారాన్ని కేంద్రం ఖండించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సత్యకుమార్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ స్ప‌ష్టం చేశారు. సత్యకుమార్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరలేదంటూ సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో బీజేపీ అధిష్ఠానం వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపిందని ఆయన స్పష్టం చేశారు.

  అలాగే నామినేషన్‌ దాఖలు సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా హాజరై, మద్దతు తెలిపారని గుర్తుచేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ-వైసీపీ మధ్య బలమైన బంధం ఉందని మరోసారి బయటపడింది. అవసరమైన ప్రతిసారి వైసీపీ.. ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూనే ఉంది. ఇటు బీజేపీ కేంద్ర పెద్దలు సైతం.. సీఎం జగన్ అడిగిన ప్రతిసారి అపాయింట్ మెంట్ ఇస్టూ స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్ర పతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి గెలవాలి అంటే.. తప్పక వైసీపీ మద్దతు అవసరమైంది.. ఈ సమయంలో జగన్ సైతం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చారు.. దీంతో ఈ బంధం మరింత బలంగా మారిందని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  ఇదీ చదవండి : మరో 24 గంటలు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్..

  మరోవైపు ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇస్తే.. టీడీపీ సైతం అడగకపోయినా ఎన్డీఏకే మద్దతు నిలిచింది. ఇప్పుడు వైపీపీ మద్దతు కోరామనే స్వయంగా కేంద్రమంత్రే ప్రకటించారు.. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి మద్దతు కోరకుండా సపోర్ట్ చేసింది. దీంతో ఏపీలో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీపై అస్త్రం దొరికనట్టు అయ్యింది. కేంద్రాన్ని వైపీపీ విమర్శించడం లేదని ఇన్నాళ్లూ టీడీపీ విమర్శిస్తూ వచ్చింది. కానీ ఇకపై అలాంటి ఆరోపణలు చేస్తే.. అధికార పార్టీ నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అసవరం లేకుండానే.. బీజేపీకి మద్దతు ఇచ్చారనే ముద్ర వేసుకుంది టీడీపీ.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు