Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS WILL TELUGU DESAM BARATIYA JANATA PARTY TIE UP FOR NEXT ELECTIONS NGS

TDP-BJP: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ పొత్తు పొడుస్తుందా..? క్లారిటీ ఇచ్చిన తెలంగాణ కాషాయ నేత

చంద్రబాబు, మోదీ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, మోదీ (ఫైల్ ఫోటో)

TDP-BJP: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో కలిసి జనసేన, బీజీపీ వెళ్తాయా..? పవన్ ఓకే అన్నా.. బీజేపీ అందుకు ఒప్పుకుంటుందా..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలాలంటే.. తెలంగాణలో టీడీపీ సాయం బీజేపీ సాయం కోరుతుందా లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంది. అయితే తాజా పరిణామాలు.. టీడీపీ-బీజేపీ పొత్తుపై తెలంగాణ కాషాయ నేత క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  TDP-BJP: ఆంధ్రప్రదే (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఉంటాయా? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ (TDP)-బీజేపీ (BJP)బంధం చిగురిస్తోందా..? తెలుగు దేశం (Telugu Desam) -జనసేన (Janasena)-భారతీయ జనతా పార్టీ (Baratiya Janata Party) మూడూ కలిసే బరిలోకి దిగుతాయా..? దీనిపై చాలా నెలల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అందుకు సై అన్నా.. బీజేపీ ఒప్పుకుంటుందా..? అసలు కేంద్రంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడ్ని కలవడానికే ఇష్టపడడం లేదంటూ ప్రచారం జరిగింది. కానీ తాజా పరిణామాలతో లెక్కలు మారాయి అంటున్నారు. మొన్నటి వరకు ఒక లెక్క.. మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తరువాత మరో లెక్క అంటున్నారు. అందుకు కారణం చంద్రబాబును ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించడమే.. అంతే కాదు త్వరలో మళ్లీ కలుద్దామని ప్రధాని అన్నట్టు స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఈ నేపథ్యంలో పొత్తు పొడుపు ఖాయమంటున్నారు.

  ప్రస్తుతం బీజేపీ మనసు మారడానికి కారణం ఏంటి..? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తో విరోధం లేదు.. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళ్లిన జగన్ ను ప్రధాని మోదీ (Prime Minster Modi) అభినందించారు. అంతే కాదు ప్రధాని కూర్చున్న టేబుల్ దగ్గరే జగన్ లంచ్ చేశారు. ఇలా వైసీపీతో కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉన్నప్పుడు టీడీపీతో పొత్తుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ అందరిలో మొదలైంది.  అందుకు ప్రధాన కారణం తెలంగాణలో తన బలాన్ని బీజేపీకి చంద్రబాబు ఎరగా వేశారానే ప్రచారం ఉంది. ఇది ఎవరో రాజకీయ విశ్లేషకులో.. టీడీపీ, బీజేపీ నేతలో అంటున్న మాట కాదు.. వైసీపీలో జగన్ తరువాత స్థానంగా చెప్పుకునే సజ్జలే ఇలాంటి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి పెద్దగా హోల్డ్‌ లేదు.. ఆ పార్టీ సానుభూతి పరులు కొన్ని కొన్ని పాకెట్స్‌లో ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే భారీగా టీడీపీ సానుభూతిపరులు ఉన్నారన్నది రాజకీయ పార్టీల లెక్క.

  ఇదీ చదవండి : టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా.. తప్పు ఒప్పుకున్న లోకేష్.. ఏమన్నారంటే..?

  కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఉండే ప్రాంతాలు కాస్తో కూస్తో ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే..అలాగే జనసేనను కూడా కలుపుకుని వెళ్తే పెద్ద సంఖ్యలో స్థానాలు దక్కించుకోవచ్చనేది కొందరు బీజేపీ నేతల అంచనా అట. అయితే తెలంగాణలో టీడీపీ సాయం బీజీపీకి కావాలి.. అందుకు ఏపీలో పొత్తు పెట్టుకోవాలనే డిమాండ్ ను చంద్రబాబు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఎందుంటే ఏపీ లో ఓట్ల శాతం పరంగా టీడీపీకి బీజేపీలో పనే లేదు.. కానీ పోల్ మేనేజ్ మెంట్ విషయంలోనూ.. వైసీపీ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయాలి అన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరం అన్నది టీడీపీ లెక్క.

  ఇదీ చదవండి: గుక్కెడు నీళ్ల కోసం యుద్ధం చేయాలా? చేతులు జోడించి వేడుకుంటున్న మహిళలు

  అందుకే తెలంగాణలో తాము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని.. అదే తరహాలో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్దామని బాబు లెక్కలు వేస్తున్నట్టు కొంత కాలంగా పొలిటికల్‌ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది వర్కవుట్‌ అవుతుందని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తే.. టీడీపీ-బీజేపీల మధ్య అవగాహనకు తెలంగాణ ఎన్నికలే బీజం వేస్తాయనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఏపీలో కూడా అదే కాంబినేషన్‌లో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్‌ ఉంటుంది.

  ఇదీ చదవండి : దంపతుల కేసుతో పోలీసుల పరేషాన్.. బుగ్గ కొరికేశాడంటూ భర్తపై ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

  ఈ ప్రచారంపై తెలంగాణలో కాషాయ నేత స్పందించారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకోదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో గానీ, ఏపీలో గానీ చంద్రబాబుతో కలిపి పని చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో ఆయనతో బీజేపీ కలిపి పని చేసిందని, కానీ ఈసారి టీడీపీతో పొత్తు ప్రశ్న ఉత్పన్నం కాదని క్లారిటీ ఇచ్చారు. సెటిలర్ల ఓట్లు అని ఆశపడితే.. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తారని.. అప్పుడు మొదటికే మోసమొస్తుందని ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp-tdp, Chandrababu Naidu, Narendra modi

  తదుపరి వార్తలు