హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: కొడాలి వర్సెస్ దగ్గుబాటి.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కారణం అదే..?

AP Politics: కొడాలి వర్సెస్ దగ్గుబాటి.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? కారణం అదే..?

కొడాలి వర్సెస్ దగ్గుబాటి

కొడాలి వర్సెస్ దగ్గుబాటి

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ తెలుగుదేశం ఫైట్ పీక్ కు చేరింది. ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గుడివాడ గడ్డపై తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానిపై వార్ కు దగ్గబాటు కుటుం బం సై అంటోందా..? నేరుగా పురందేశ్వరి బరిలో దిగుతారా..? లేక.. ఆమె వారసుడ్ని పోటీలో నిలబెడతారా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gudivada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినా.. అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల సమరానికి ముందుగానే సిద్ధం అంటున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఒకప్పుడు నారా ఫ్యామిలీ వర్సెస్ దగ్గుబాటి (Nara Vs Daguubati) పోటీ తారాస్థాయిలో ఉండేది.. కానీ ఇప్పుడు నారా ఫ్యామిలీకి దగ్గుబాటు దగ్గర అవుతుందనే ప్రచారం ఉంది. ఈ దూరం తగ్గడానికి వైసీపీ (YCP) నే కారణం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ఎందుకంటే..? ఇటీవల నారా కుటుంబానికి చెందిన.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) భార్య భువనేశ్వరిని.. వైసీపీ నేతలు పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.

  సొంత సోదరిని అనడం ఇటు పురందేశ్వరికి కోపం తెప్పించే అంశమే.. దానికి తోడు.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు నాయుడికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే.. పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే శత్రువులును కూడా ఆయన దగ్గర చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా దగ్గుబాటి కుంటుంబానికి సన్నిహితంగానే ఉంటున్నారు.

  ఇదే సమయంలో.. దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీలో ప్రాధాన్యత తగ్గుతోందా అని చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగా నాడు యూపీఏలో కేంద్ర మంత్రిగా.. ఆ తరువాత బీజేపీలో చేరిన పురందేశ్వరికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆ గుర్తింపు తగ్గుతోంది. ఇందుకు అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అధినాయకత్వం అసంతృప్తి తో ఉన్నట్లుగా టాక్. దీని కారణంగానే గతనెలలో ఒడిషా బాధ్యతలు, తాజాగా ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ పురందేశ్వరిని బిజేపి అగ్రనాయకత్వం తప్పించిందంటూ బీజేపీలో చర్చ జరుగుతోంది.

  ఇదీ చదవండి : ఆ మంత్రికి తెలుగురాదా? రిటైర్మెంట్ తీసుకో అంటూ జగన్ సీరియస్ అయ్యారా..? ఎవరా మంత్రి?

  పురందేశ్వరి అధ్యక్షతన ఏపిలో విస్తృత చేరికల కమిటీ ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయంలో పార్టీ ముఖ్య నాయకత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా.. బీజేపీకి మేలు జరిగే విధంగా వ్యవహరించలేకపోతున్నారని చెబుతున్నారు. పురందేశ్వరికి గౌరవం ఇచ్చినా.. పార్టీ అప్పగించిన చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదనేది కమలం సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. అంతేకాదు ఆమె చంద్రబాబు నాయుడకు దగ్గర అవుతున్నారనే ప్రచారం కూడా జోరుగానే ఉంది.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కేబినెట్ లోకి మళ్లీ మాజీలు.. ఆ ఇద్దరికీ బెర్త్ లు ఫిక్స్..? ముహూర్తం ఎప్పుడు?

  తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కుటుంబ టీడీపీలో చేరడం ఖాయమంటున్నారు. ఒకవేళ ఆమె నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరకపోయినా..? తన కుమారుడ్ని టీడీపీలో జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ.. గుడివాడ కొడాలి నానిని ఓడించాలనే కంకణం కట్టుకుంది. కాని అక్కడ సరైన అభ్యర్థి దొరకడం లేదు. అయితే కొడాలి నానిని ఎదిరించాలి అంటే.. నందమూరి కుటుంబానికి చెందిన వారైతే.. గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని.. స్థానికంగా ఉన్న ఆ సామాజిక వర్గాల ఓట్లు కూడా నానికి వ్యతిరేకంగా పడతాయని లెక్కలు వేస్తున్నారు.

  ఇదీ చదవండి : దేశంలోనే రెండో అతి పెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎలా చేశారో చూడండి

  మరోవైపు ఇటీవల కొడాలి నాని .. సంచలన వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ తల్లిని అవమానించేలా మాట్లాడారు అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఈ సారి ఎలాగైనా కొడాలిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. నేరుగా తన సోదరిపై వ్యాఖ్యలు చేయడం పురందేశ్వరికి సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఆమె గుడివాడలో పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Daggubati Venkateshwara Rao, Kodali Nani, Purandeswari, Ycp

  ఉత్తమ కథలు