Chandrabau Will Arrest?: సంక్షేమ పథకాల (Welfare Scheme ) తో ప్రజలకు చేరువ అయ్యాం.. అంతా పాజిటివ్ గా ఉందని వైసీపీ ప్రభుత్వం (YCP Government) భావిస్తోంది. ఇటు దారుణ పాలన, అరాచక పాలన అంటూ.. ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత పెరిగేలా చేయడంతో కొంత మేరకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.. అన్నింటికన్నా ముఖ్యంగా గతంలో సీఎం జగన్ (CM Jagan) జైలుకు వెళ్లడానికి ప్రధాన కారణం చంద్రబాబే అన్నది వైసీపీ నేతల గట్టి వాధన.. అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగినా.. దాని వెనుక ఉన్నది మాత్రం చంద్రబాబేనని జగన్ భావించారు. ఇంకా చెప్పాలంటే సోనియా గాంధీ (Sonia Gandhi) కంటే చంద్రబాబుపైనే జగన్ పగ, ప్రతీకారాన్ని పెంచుకున్నారని. ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ వస్తున్నారన్నది వైసీపీ వర్గాల్లోనూ ప్రచారం ఉంది. అందుకే రిటన్ గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ ఉన్నారన్నది రాజకీయ వర్గాల టాక్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం లూప్ హోల్స్ ను వెతుకుతూ వస్తోంది ప్రస్తుతం ప్రభుత్వం. చంద్రబాబు ఎక్కడైనా అవినీతికి పాల్పడి ఉంటారని ప్రత్యేక అధికారుల బృందంతో పెద్ద మేథోమథనమే జరుగుతూ వస్తోంది. ఎన్నో కేసులు వేశారు.. దర్యాప్తు కూడా చేశారు. కానీ కోర్టుల ద్వారా చంద్రబాబు ఆ విచారణల నుంచి తప్పుకుంటున్నారు. కనీసం విచారణ పేరుతోనైనా చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశాలను ప్రభుత్వం వదలడం లేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన... కానీ అది సాధ్యపడడం లేదు.
ఈ సారి మాత్రం చంద్రబాబు తప్పించుకోడానికి వీళ్లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన బుర్రకు పదునుపెట్టారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road) అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు. ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతూ ఉంటారు. కానీ అమరావతి (Amaravati) కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( MLA Rama Krishna Reddy) ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు (CID Case) నమోదు చేశారు. ఈ ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ ఖరారులో అవినీతి జరిగిందని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం సామాన్యులకు … ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేశారు.
తాజా ఎఫ్ఐఆర్ ను చూస్తే.. ఈ వ్యవహారంలో చంద్రబాబును ఏ-2గా, నారాయణను ఏ-2గా సీఐడీ పేర్కొంది. ఏ-3గా లింగమనేని రమేష్, ఏ-4గా లింగమనేని రాజశేఖర్, ఏ-5గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్, ఏ-6గా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఏ-7గా ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, ఏ-8గా ఎల్ఈపీఎల్ ఇన్ఫోసిటీ, ఏ-9గా ఎల్ఈపీఎల్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ-10గా లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ-11గా లింగమనేని ఆగ్రో డెవలపర్స్, ఏ-12గా జయని ఎస్టేస్ట్స్, ఏ-13గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ- ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను పేర్కొంది. కానీ ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరికి నష్టం చేశారు…? ఎలా నష్టపోయారు? అన్న అంశాలు ఎఫ్ఐఆర్‌లో లేవు. సీఐడీ పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని.. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని.. ఆ దర్యాప్తులో ఆధారాలున్నాయని కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు.
ఇదీ చదవండి : : పవన్ దేవుడా..? లేక జ్యోతిష్యుడా..? దమ్ముంటే సింగిల్ గా రావాలి అంటూ రోజా సవాల్
ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి విషయంలో అభియోగాలు మోపి నిరూపించలేకపోయారని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కానీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేసి జైలుకు పంపించే ఎత్తుగడగా వారు అనుమానిస్తారు. మాజీ మంత్రి నారాయణ లాగే..? చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Ycp