Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS WHO WILL BE NEXT HOME MINSTER THESE FOUR MLAS TRYING TO BERTH NGS

AP Next Home Minister: ఏపీ కాబోయే హోమంత్రి రేసులో ఆ నలుగురు..? ఫైర్ బ్రాండ్ కు అవకాశం ఉందా..?

మహిళా ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి దక్కేదెవరికి..?

మహిళా ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి దక్కేదెవరికి..?

AP Next Home Minister: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో మార్పులు తప్పవన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురైదుగురు మినహా అంతా.. రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మహిళా మంత్రులు ముగ్గురూ రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువ.. దీంతో హోం మంత్రి పదవి ఖాళీ అవుతోంది. మరి ఆ పదవిని ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు సీఎం జగన్.. మళ్లీ మహిళకే హోం మంత్రి పదవి అంటూ ప్రచారం జరుతుండడంతో.. రేసులో ఆ నలుగురు ఎమ్మెల్యే పేర్లు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  AP Next Home Minister:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మంత్రి వర్గంలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  దీనిపై మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. మంత్రి పదవి పోయిందని ఎవరూ నిరాశ చెందవద్దంటూ.. వారికి పార్టీ బాధ్యతలు అప్ప చెబుతున్నామని చెప్పేశారు. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం.. నలుగురైదుగురు మంత్రులు మినహా.. మిగిలిన వారంతా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే..  ప్రస్తుత కేబినెట్ లో మహిళా మంత్రులుగా.. మేకతోటి సుచరిత (Mekathota Sucharitha) , పాముల పుష్పశ్రీవాణి (Pamula Pushpasrivani), తానేటి వనిత (Thaneti vanitha)లో ఉన్నారు. వీరిలో హోమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. కేబినెట్ అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఆమె కూడా.. మంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మొత్తం ముగ్గురు మహిళా మంత్రులను తప్పించి వారి ప్లేస్ లో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్టు ఇప్పటికే వైసీపీ వర్గాల్లో క్లారిటీ ఉంది.  మహిళా ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.  అందులో హోం మంత్రి పదవి ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సారి కూడా మహిళా హోంమంత్రే ( Women Home Minister ) వస్తారని..  ఎస్సీ,  బీసీ వర్గాల్లో ఒక ఎమ్మెల్యేకు చాన్స్ ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా నలుగురి పేర్లు రేసులో ఉన్నాయి.  అందులో ఫైర్ బ్రాండ్ కు మాత్రం నిరాశ తప్పదని మరో ఓ వర్గం వాదన.

  మహిళా మంత్రి రేసులో వినిపిస్తున్న పేర్లలో ముందుగా ఉత్తరాంధ్రకే ప్రధాన్యం ఉంటుంది అంటున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి (Reddy Santhi)ఈ రేసులో ముందు వరసులో ఉంటారు. ఒక వేల సామాజిక సమీకరణాలు.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే.. అనంత‌పురం జిల్లా సింగ‌న‌మ‌ల‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ ప‌ద్మావ‌తి ( Jonnalagadda Padamavati ) అలాగే చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే విడుద‌ల ర‌జ‌నీ ( vidadala Rajani ) పేరు కూడా వినిపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు.. సీమకే చెందిన మరో కీలక నేత పేరు కూడా చర్చల్లో ఉంది.. ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే రోజా.. ఈ నలుగురిలో ఒకరికి హోం మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది.

  ఇదీ చదవండి : తారక్ రిక్వెస్ట్ తోనే ఆర్ఆర్ఆర్ కు సీఎం జగన్ శుభవార్త చెప్పారా..? ఆ మంత్రే దగ్గరుండి ఒప్పించారా..?

  అయితే ఈ నలుగురిలో.. జొన్నలగడ్డ పద్మావతి, విడదల రజనీలకు ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది. ఇద్దరూ తొలి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఒకరు ఎస్సీ ..మరొకరు బీసీ. ఈ సామాజిక వర్గాలే వారికి ప్లస్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు సీఎం జగన్ కు చాలా కీకలం.. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిలో ఒకరికి హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. గుంటూరు జిల్లా ప‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎన్నిక‌యిన సుచ‌రిత ( Mekathoti Sucharita ) హోం మంత్రిగా ప‌ని చేస్తున్నారు. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ కు అధిక ప్రాదాన్య‌త ఇస్తూ కొత్త హో మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయనే టాక్ ఉంది.

  ఇదీ చదవండి : సాగర తీరంలో స్వామి వారి దర్శనానికి వేళాయే.. ప్రత్యేకతలు ఎన్నో తెలుసా..?

  అయితే మెద‌ట్లో రోజాకే హోం మినిస్టర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమెకు సామాజిక సమీకరణాలతో పాటు.. స్థానికంగా రాజకీయ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి అంటున్నారు. రోజాకు హోం మినిస్టర్ పదవి ఇస్తే.. అక్కడ నుంచి మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న భూమన కరుణా కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కూడా ఇవ్వాలి. దీనికి తోడు నగరిలో ఉన్న స్థానిక వైసీపీ నేతలు సైతం రోజాకు పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు చెపుతున్నారు. ఇవాన్నీ ఆమెకు మైనస్ గా మారాయి. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతికి కూడా సామాజిక సమీకరణాలే మైనస్ అయ్యాయి అంటున్నారు వైసీపీ వర్గీయులు.

  ఇదీ చదవండి : మంత్రి పదవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా..? గుళ్లు గోపురాల చుట్టూ రోజా..?

  దీంతో రోజా, రెడ్డి శాంతిల పేర్లు షార్ట్ లిస్ట్ కాలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన పద్మావతి, రజనీలలో ప్ర‌దానంగా అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేసిన సుచ‌రిత‌ గుంటూరు జిల్లా నుండి ప్రాతినిద్యం వ‌హిస్తున్నారు. మళ్లీ అదే జిల్లాకు చెందిన చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ద‌క్కే అవ‌కాశాలు త‌క్కువ అంటున్నారు. కానీ ఆమె పార్టికి, జ‌గ‌న్ కు అత్యంత విధేయురాలు, చాలా సైలెంట్ గా ప‌ని చేస్తార‌నే అభిప్రాయం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nagari MLA Roja, Vidadala Rajani, Vizianagaram

  తదుపరి వార్తలు