AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS VIJAYWADA MAYOR BHAGYALAXMI NEW DEMAND SHE WANT 100 TICKETS FOR EVERY NEW MOVIE NGS GNT
Mayor demand: మా కోటా వంద టికెట్లు.. కొత్త సినిమా వస్తే ప్రతి షోకూ ఇవ్వాలంటూ థియేటర్లకు లేఖ
థియేటర్ల యజమానులకు మేయర్ లేఖ
Mayor demand for Tickets: కొత్త సినిమా రిలీజ్ అయితే.. మొదటిలోనే భారీగా డిమాండ్ ఉంటుంది. అభిమానులు.. థియేటర్ యజమానులు సన్నిహితులు.. సినిమా సెలబ్రిటీలతో పరిచయం ఉన్నవారు.. పోలీసులు, రాజకీయ నేతలు ఇలా టికెట్ల పై పూర్తి స్థాయి ఒత్తిళ్లు ఉంటాయి.. అయితే తాజాగా ఓ మేయర్.. కొత్త సినిమా రిలీజ్ అయితే తనకు 100 టికెట్లు పంపాలి అని లేఖ రాయడం సంచలనంగా మారింది.
Mayor demand for Tickets: మొన్నటి వరకు టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం (Tollywood vs Government) అన్నట్టు ఉండేది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పరిస్థితి. ప్రభుత్వం అంటేనే టాలీవుడ్ పెద్దలు అంత ఎత్తున లేచేదాకా పరిస్థితి వెళ్లింది. వకీల్ సాబ్ తో మొదలైన యుద్ధం.. భీమ్లా నాయక్ (Bheemla Nayak) రిలీజ్ వరకు కొనసాగింది.. టికెట్లు రేట్లు తగ్గించిన ప్రభుత్వం.. పేదవాడికి వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో తక్కువ ధరలకు కచ్చితంగా టికెట్లను విక్రయించాలి అంటూ జీవో కూడా తెచ్చింది. అయితే దీనిపై సినిమా పరిశ్రమ నుంచి వూహించని వ్యతిరేకత వచ్చింది. సినిమా వర్గం మొత్తం ప్రభుత్వానికి దూరమయ్యే పరిస్థితి కనిపించింది. అలాంటి సమయంలో సినిమా పరిశ్రమ పెద్ద హోదాలో మెగస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కలుగు జేసుకోవడంతో వివాదం సద్దు మణిగింది. చిరంజీవితో పాటు ప్రభాస్ (Prabash), మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli), కొరటాల శివ (కొరటాల శివ) లాంటి వారు సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకోవడంతో వివాదానికి సీఎం జగన్ తెరిదించారు. అయితే అనుకోకుండా మధ్యలో భీమ్లా నాయక్ విడుదల అవ్వడం. ప్రభుత్వం నిర్ణయం ఆలస్యం కావడంతో ఇదంతా ప్రభుత్వమే చేసిందని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. వారు ఆరోపించినట్టుగా భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యిన చాలా రోజుల గ్యాప్ తరువాత.. రాధేశ్యామ్ సినిమా విడుదలకు సరిగ్గా టికెట్ల ధరలను ప్రభుత్వం పెంచింది.. దీంతో ఆ వివాదం సద్దుమణిగినట్టే అయ్యింది. ఈ సమయంలో ఓ మేయర్ రాసిన లేఖ సంచలనంగా మారింది.
సినిమా థియేటర్లకు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిపోయింది.. కొత్త సినిమా విడుదలైన సందర్భంగా తమకు ప్రతీ షోకి వంద టికెట్లు ఇవ్వాలని ఆమె లేఖలో థియేటర్ల యాజమాన్యాలను కోరారు. ఎందుకంటే కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో ఒక రకంగా తమకు ఎదురైయ్యే ఇబ్బందులను కూడా లేఖలో ఆమె వివరించే ప్రయత్నం చేశారు. ప్రతీ నెల కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయని.. అయితే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో టికెట్లు కావాలని పార్టీ ప్రతినిధులు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
వారందరి నుంచి వస్తున్న డిమాండ్లకు తగ్గట్టు.. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా తమకు ప్రతీ షోకు 100 టికెట్లు ఇవ్వాలని.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మేయర్ చాంబర్‌కు వంద టికెట్లను పంపించాలని లేఖలో పేర్కొన్నారు మేయర్ భాగ్యలక్ష్మి.. అయితే, ఆ సినిమా టికెట్లకు సంబంధించిన డబ్బును తామే చెల్లిస్తామని లేఖలో సినిమా థియేటర్ల యాజమాన్యాలను కోరారు మేయర్. మొత్తంగా సినిమా థియేటర్లకు టికెట్ల కోసం మేయర్ లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.