Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS THIS JUNE AP CABINET WILL EXPAND WHO WILL GET CHANCE AS MINSTER NGS

AP Cabinet: మహిళా మంత్రులు పుష్పశ్రీవాణి, సుచరిత, వనిత కొనసాగుతారా? రోజా, రజని, పద్మావతిల్లో ఎవరికి ఛాన్స్?

మహిళా ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి దక్కేదెవరికి..?

మహిళా ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి దక్కేదెవరికి..?

AP Cabinet: ఏపీలో మహిళా మంత్రులకు సీఎం జగన్ వేసే మార్కులు ఎన్ని.. మళ్లీ ఎవరికి కొనసాగింపు ఉంటుంది..? ఎవరిని తప్పించే అవకాశం ఉంది.. ముగ్గుర్నీ మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారా.. కొత్తగా పదవి ఆశిస్తున్న మహిళా ఎమ్మెల్యేల్లో టాప్ రేసులో ఉన్నది ఎవరు..?

ఇంకా చదవండి ...
  AP Cabinet: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రు పదవులు హాట్ టాపిక్ అయ్యింది. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు చెప్పేశారు.  త్యాగాలకు సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైందని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది మంత్రి పదవికి బై బై చెప్పి.. పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అంటూ స్పష్టంగా చెప్పేశారు. అంతేకాదు ఆశావాహులు సైతం భారీగానే ఉన్నారని ఆయనే చెప్పారు. గత ఆరు నెలలుగా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని, తమకు మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందని చూస్తున్న ఆశావాహులకు జగన్ వ్యాఖ్యలు కొత్త ఉత్సాహం కలిగించేలా చేశాయి. రాబోయే జూన్ లో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ క్లారిటీ ఇచ్చేశారు.. ఈ నెల 15న జరిగే వైఎస్సార్సీపీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదీ ఏమైనా మంత్రివర్గంలో మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది.. దీంతో పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు…పదవులు దక్కించుకోవడానికి రెడీ అయిపోయారు..ఇదే క్రమంలో పదవులు ఆశిస్తున్న మహిళా ఎమ్మెల్యేలు సైతం..మహిళా కోటాలో ఛాన్స్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు..పుష్పశ్రీ వాణి (Pamula Pushpa Srinu), మేకతోటి సుచరిత (Mekathoti sucharitha), తానేటి వనిత (Thaneti Vanitha)లు ఉన్నారు. మరి వీరి ముగ్గురిలో పదవిలో కొనసాగేది ఎవరు..? మారితే వారి స్థానంలో ఎవరిక అవకాశం ఉంది..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురుని మంత్రివర్గం నుంచి తప్పించడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారనే టాక్ ఉంది. దీనిపై ఆయా మహిళా మంత్రులకు కూడా క్లారిటీ ఉందని వైసీపీ వర్గాల టాక్. త్వరలోనే జరగబోయే మంత్రివర్గం మార్పులో ఈ ముగ్గురు మహిళా మంత్రులు సైడ్ అవ్వడం ఖాయమనే అంతా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మహిళా నేతల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ఇప్పటికే సీఎం జగన్ ను వారంత స్వయంగా కలిసి తమ మనసులో మాట బయటపెట్టినట్టు ప్రచారం కూడా ఉంది.

  ఇదీ చదవండి : కొడాలి నానిని కొనసాగిస్తారా..? కలిసి వచ్చే అంశం అదే.. మైనస్ మార్కులు ఎన్ని?

  కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే ఎప్పటి నుంచో ఈ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత కేబినెట్ లోనే ఆమె తనకు ఛాన్స్ వస్తుందని భావించారు. కానీ సమాజిక, స్థానిక నియోజకవర్గ సమీకరణాలతో తొలిసారి నిరాశ తప్పలేదు. అయినా నిరాశ చెందకుండా.. అధినేత జగన్ కు మరింత చేరువయ్యే ప్రయత్నం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటు మంచి మార్కులు వేసుకున్నారు. సీఎం జగన్ సైతం ఆమెకు భరోసా ఇచ్చేరని ప్రచారం ఉంది. అయితే ఆమెకు స్థానికంగా పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. 

  ఇదీ చదవండి : ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కొత్త ఈక్వేషన్లు.. జగన్ అవసరం ఇక కేంద్రానికి లేనట్టేనా..?

  అటు తొలిసారి ఎమ్మెల్యేలు అయిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సైతం పదవి ఆశించే లిస్ట్ లో ఉన్నారని తెలుస్తోంది. బీసీ కోటాలో రజిని, ఎస్సీ కోటాలో పద్మావతి పదవి దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విడుదల రజనీ భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు టాక్.. భారీ స్థాయిలోనే ఆమె లాభీయింగ్ చేశారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు సీఎం జగన్ తో కలిసి ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. అధినేత చూపు తనవైపు పడేలా ప్రత్యేకంగా హడావుడి చేస్తారనే ప్రచారం.

  ఇదీ చదవండి : అమ్మవారి సేవలో రోజా.. పూజలు అందుకేనా..? క్లారిటీ వచ్చిందా..?

  కేవలం వీరే కాదు.. ఇంకా పలువురు మహిళా ఎమ్మెల్యేలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీరిలో సీఎం జగన్ ఎవరికి శుభవార్త చెబుతారో చూడాలి.. కానీ మహిళా మంత్రులు ముగ్గుర్నీ మార్చడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పని తీరు పరంగా చూసినా.. స్థానిక పరిస్థితులు. సామాజిక సమీకరణాలు ఏ లెక్కన చూసినా.. వీరిని పదవుల నుంచి తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, AP News, Nagari MLA Roja, Pamula Pushpa Sreevani, Vidadala Rajani

  తదుపరి వార్తలు