హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు.. దమ్ముంటే కొడాలి నాని తనతో పోటీ పడాలంటూ.. టీడీపీ నేత సవాల్..

AP Politics: చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు.. దమ్ముంటే కొడాలి నాని తనతో పోటీ పడాలంటూ.. టీడీపీ నేత సవాల్..

మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ సవాల్..

మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ సవాల్..

AP Politics: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది.. ఐదోసారి గెలుపు కోసం కొడాలి నాని సై అంటున్నారు. ఇటు టీడీపీ ఆయన్ను ఎలాగైనా ఓడించాలని పావులు కదుపుతోంది. దీంతో ఆయన అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Gudivada, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

AP Politics:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు ప్రధాన కారణం అక్కడ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కొడాలి నాని ఉండడమే.. ఆయన కేవలం గుడివాడకు పరిమితం అయిన నేతే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఓ వర్గం ఆయన్ను అత్యంత అభిమానిస్తుంది కూడా.. అందుకు ప్రధాన కారణం.. తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు .. నారా లోకేష్ లపై ఆయన విరుచుకు పడుతుండడమే.. ఆ ఇద్దరు  పేర్లు వింటే చాలు.. బూతులు తిట్టడానికి కూడా కొడాలి వెనక్కు తగ్గరు.. అందుకే చంద్రబాబును ద్వేషించే వారందరికి.. కొడాలి నాని హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి.. అందుకే ఎలాగైనా నానిని ఓడించాలని టీడీపీ పదే పదే లక్ష్యంగా పెట్టుకుంటూ.. చతికిల పడుతోంది.

గత ఎన్నికల్లో బలమైన నేత అని భావించి దేవినేని అవినాష్ ను కొడాలి నానికి వ్యతిరేకంగా బరిలో దింపినా.. ఫలితం మారలేదు. ఆ వెంటనే అవినాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఈ సారి టీడీపీ అభ్యర్థి ఎవరు అన్నది ఉత్కంఠ పెంచుతోంది. ఓ వైపు నందమూరి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలో దింపాలనే డిమాండ్ ఉంది. మరోవైపు ఓ ఎన్ఆర్ఐ ను బరిలో దింపే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటున్నారు.

ఎన్ఆర్ఐ అయిన రాము అభ్యర్థిగా చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు రాము కుటుంబసభ్యులు. వచ్చేనెల నుంచే గుడివాడలోనే వెనిగళ్ల రాము ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆ ప్రచారంపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. అయితే మరో ప్రచారం కూడా ఉంది.. స్థానిక ఇంఛార్జ్ రావి వెంకటేశ్వ రావుకే ఈ సారి అవకాశం ఇస్తారు అంటున్నారు.

ఆ ప్రచారాలు ఎలా ఉన్నా..? కొడాలి నాని మాత్రం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చినా.. లోకేష్ బరిలో దిగినా..? కాదు అంటే ఎన్ఆర్ఐ ను బరిలో దింపినా.. తన గెలుపును ఆపలేరన్నారు. గుడివాడ ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరని.. అంతా కట్టకట్టుకుని  వచ్చినా ఓడించలేరని ఛాలెంజ్ చేశారు.

తాజాగా ఆయన వ్యాఖ్యలపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. కొడాలి నాని బతుక్కి చంద్రబాబు, లోకేష్ కావాలా.. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. ఇటువంటి నాయకులను ఎన్నుకొని ఇదేం కర్మ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కొడాలి నానికి ఇటీవల కిడ్నీ ఆపరేషన్ తో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా వెదజల్లిన 2024 లో కొడాలి నాని గెలవలేడని జోష్యం చెప్పారు.

ఇక్కడ కొస మెరపు ఏంటంటే.? దమ్ముంటే తనపై పోటీ చేసి.. గెలవాలి అని కొడాలి నానికి రావి సవాల్ విసిరారు.. కానీ అసలు గుడివాడ టికెట్ కు ఆయనకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారో లేదో క్లారిటీ లేదు.. ఎన్ఆర్ఐ నే బరిలో దింపుతారని.. జోరుగా ప్రచారం జరుగుతోంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani, TDP, Ycp

ఉత్తమ కథలు