Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS TDP LEADER NARA LOKESH SLAMS TO CM JAGAN AND GOVENEMNT NGS

Nara Lokesh: సీఎం జగన్ నిజం చెప్పలేరు.. అలా చెబితే ఆయన తల 1000 ముక్కలే.. నారా లోకేష్‌ సెటైర్లు

ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు

ఏపీ బడ్జెట్ పై నారా లోకేష్ సెటైర్లు

Nara Lokesh: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్నా.. నారా లోకేష్.. సీఎం జగన్ పాలనపై వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఆయన విమర్శల్లో పదును పెరిగింది.. ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ అవుతున్నాయి. తాజా లోకేష్ చేసినా వ్యాఖ్యలు సైతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇంకా చదవండి ...
    Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను నాటు సారా అంశం కదిపేస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది. ఇక అసెంబ్లీలో అయితే టీడీపీ (TDP) రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా జంగారెడ్డి గూడెం  (Jangareddy Gudem) లో ఆకస్మిక మరాణాలపై టీడీపీ అవేదన వ్యక్తం చేసింది. అక్కడ వార్తం కల్తీ సారా (Cheep Liquor ) తాగి మరణించారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ.. టీడీపీ మండిపడుతోంది. దీనిపై సభలో చర్చ చేయాలి అంటూ కొన్ని రోజుల పాటు సభకు ఆటంకం కలిగించింది. ఆఖరికి సస్పెండ్ అవ్వడానికి కూడా సిద్ధమైంది. ఇలా నాటు సారాపై టీడీపీ యుద్ధం చేస్తూనే ఉంది.. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏపీలో నాటు సారాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతూ వస్తోంది. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దీనిపై క్లారిటీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెంలో మరణాలను సహజ మరణాలుగా చెప్పారు. అసలు గ్రామీణ ప్రాంతాల్లోనే నాటు సారా నిలిపివేశామని.. ఇక నగరాల్లో నాటు సారా ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు.. అయితే టీడీపీ హయాంలోనే ఎక్కువగా నాటు సారా ఉండేది.. అని తమ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సభలో సీఎం స్పష్టం చేశారు. తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ట్వీట్ చేశారు.

    ఆయన నిజం చెబితే.. జగన్‌ తల 1000 ముక్కలే అంటూ సంచలన ట్వీట్‌ చేశారు. ఏ విషయంలోనైనా ఆయన నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. అందుకే ప్రతి విషయంలో అబద్ధాలే శ్వాసగా సీఎం బ్రతికేస్తున్నారు! అంటూ ఎద్దేవా చేశారు. అందుకే అంత ఈజీగా అసెంబ్లీ వేదికగా కూడా జగన్ అబద్ధాలు ఆడేస్తున్నారని.. ఒకవేళ నిజం చెబితే అలాంటి శాపం ఏదైనా ఉందో ఏమో అని అనుమానం ఉందన్నారు నారా లోకేష్..

    నాటు సారా లేదు అంటూ చెబుతున్న జగన్ ఇది చూడాలి అంటు మరో ట్వీట్ చేశారు. ఇదిగో మీ సొంత ఊళ్లో నాటు సారా బట్టీ చూడండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా అడిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి. మరి దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయని లోకేష్ గుర్తు చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకి అంతు లేదని నారా లోకేష్‌ మండి పడ్డారు. వైసీపీ సర్కార్ కు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

    ప్రస్తుతం లోకేష్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల లోకేష్ లో చాలా మార్పు కనిపిస్తోంది. గతంలో విమర్శలు చేయడంలోనూ లోకేష్ తడబడే వారు.. కానీ ఇప్పుడు తన విమర్శల్లో పదును పెంచారు. ముఖ్యంగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ.. పవర్ ఫుల్ పంచ్ లు పేలుస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు