హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP-BJP Alliance: ఏప్రిల్ లో ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో సమావేశం.. పొత్తులపై ప్రతిపాదనలు ఇవే..!

TDP-BJP Alliance: ఏప్రిల్ లో ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో సమావేశం.. పొత్తులపై ప్రతిపాదనలు ఇవే..!

ఏప్రిల్ లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు నాయుడు.. పొత్తులపై అప్పుడే క్లారిటీ..?

ఏప్రిల్ లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు నాయుడు.. పొత్తులపై అప్పుడే క్లారిటీ..?

TDP-BJP Alliance: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పొత్తులకు అడుగులు పడుతున్నాయా? ఈ ఏడాది ఏప్రిల్ తరువాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి.. బీజేపీ నేతలను కలుస్తారనే ప్రచారం ఉంది..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

TDP-BJP Alliance:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా పొత్తుల రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగు దేశం - జనసేన పొత్తు దాదాపు ఖరారు అయ్యిందనే ప్రచారం ఉంది. అయితే ఈ కూటమితో బీజేపీ కలిసి నడుస్తుందా.. లేదా అన్నదానిపై మాత్రం వివిద రకాల ప్రచారాలు ఉన్నాయి. ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ బీజేపీతో కలిసే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి.  ఈ విషయాన్ని పవన్ బహిరంగంగానే చెప్పారు. బీజేపీని ఒప్పించే బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు నేరుగా బీజేపీ పొత్తు గురించి మాట్లాడలేదు. కానీ బీజేపీ పెద్దలను కలిసేందుకు.. పొత్తుకు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల సమాచారం.

జనసేన, టీడీపీ సుముఖంగా ఉన్నారు. అలాగే ఏపీ బీజేపీలోనూ చాలామంది నేతలు పొత్తు ఉంటేనే బాగుటుందనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎంపీ జీవీఎల్ తో పాటు ఒకరిద్దరు మాత్రం టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని చెబుతూ వస్తున్నారు.

కేంద్ర పెద్దలు మాత్రం ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ పెద్దలు అయిన ప్రధాని మోదీ , హోం మంత్రి అమిత్ షా కు అస్సులు ఇష్టం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్న మాట.. గతంలో 2019 ఎన్నికల సమయంలో మాట్లాడిన అమిత్ షా.. భవిష్యత్తులో చంద్రబాబును మళ్లీ ఎన్డీఏలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పలేం..

బీజేపీ ఉన్నత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి నెల  ఆఖరు.. లేద ఏప్రిల్ తొలి వారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అప్పుడే మోదీ, అమిత్ షాలతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.  ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తుకంటే ముందు.. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులపై రెండు పార్టీలు అంచనాకు వస్తాయని తెలుస్తోంది.

తెలంగాణలో జూన్ లేదా జులైలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే నవంబర్ లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ లోపే పొత్తులపై క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారం చేపట్టాలి అంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిందని నివేదిక బీజేపీ పెద్దలకు చేరినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 10 నుంచి 15 నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చేయగలిగే బలం టీడీపీ ఉందని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటు.. కర్నాటక ఎన్నికల్లోనూ మద్దతు ప్రకటించి.. అభ్యర్థుల గెలుపుకు ప్రయత్నిస్తామని.. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతు దారులు భారీగా ఉన్నారని.. చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. ఈ లోపు బీజేపీ పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ , కర్నాటకల్లో టీడీపీ బలం ఎంత..? పొత్తు పెట్టుకుంటే లాభం ఏంటన్నది నివేదికలు తెప్పించుకుంటున్నారని.. ఆ తరువాతే చంద్రబాబుకు పొత్తుపై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, TDP, Ycp

ఉత్తమ కథలు