Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
Big Shock: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) కి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి.. రెబల్ ఎమ్మెల్యే ఆరోపణలతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా స్పీకర్ ఫేక్ లా సర్టిఫికేట్ (Fake Law Certi) వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. అదికూడా స్పీకర్ తమ్మినేని సీతారాం (Speakar Tammineni Seetaram) కు అల్లుడైన.. ప్రత్యర్థి పార్టీ నేత కూన రవి కుమార్ (Kuna Ravikumar).. దీనిపై జాతీయ స్థాయి పోరాటానికి సిద్ధమయ్యారు. ఇఫ్పటికే స్పీకర్ ఫేక్ సర్టిఫికేట్ అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తమ్మినేని సీతారాం, కూన రవి కుమార్ వరుసకు మామా అళ్లుల్లు.. ఇద్దరూ ఒకప్పుడు జిల్లాలో ఆదిపత్యం చెలాయించే వారు. ఇప్పుడు పార్టీలు వేరు అవ్వడంతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. మామను సరైన దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్న రవి కుమార్ కు.. శీతారం ఢిగ్రీ లేకుండా న్యాయపట్టా పొందారనే విషయం తెలియడంతో దీనిపై జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా ఎల్ఎల్బీ కోర్స్ చేయాలి అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి.. కానీ గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో డిగ్రీ పూర్తి కాలేదని ఉంది. అంతేకాదు గతంలో కొన్ని ఇంట్వర్వ్యూలలో సైతం డిగ్రీ పూర్తి కాలేదని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి , కోటబోమ్మాళిలలో ప్రాధమిక విధ్యను , శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ విధ్యను అభ్యసించినట్లు , అదేవిదంగా డిగ్రీ (హెచ్ ఇసి) డిగ్రీ డిస్ కంటిన్యూ చేసినట్లు స్పీకర్ పలు టీవీ ఇంటర్వూలతో పాటు , ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కోన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ తరువాత లా చేయాలి అనుకుంటే ఐదేళ్ల కోర్సులో జాయిన్ అవ్వాలి. మరి డిగ్రీ పూర్తి కాకాకుండా మూడేళ్ల ఎల్ ఎల్ బీ కోర్సు కోసం ఎలా అడ్మిషన్ తీసుకున్నారన్నదానిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇదీ చదవండి : తిరుమలను తాకిన వైసీపీ విబేధాలు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు చైర్మన్ కౌంటర్ ఇదే..
కేవలం ఒక నెల వ్యవధిలో ఏవిధంగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి.. ఎల్ఎల్ బీ జాయిన్ అయ్యారా.. లేక చేతిలో ఉన్న అధికారాని దుర్వినియోగం చేశారా? యూనివర్శి అధికారులను మభ్య పెట్టో.. బెదిరించో లా కాలేజ్ లో జాయిన్ అయ్యారన్నది టీడీపీ నేతల వాదన.. గౌరవనీయమైన.. అత్యంత బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని సీతారామం ఇలా.. వ్యవస్థలను మోసం చేయడం.. ఫేక్ లా డిగ్రీ సర్టిఫికేట్ పొందడం పై చర్యలు తీసుకోవాలని.. కోరుతు నేరుగా రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు కూన రవి.
ఇదీ చదవండి : ఏపీలో ఉప ఎన్నికలు రానున్నాయా ? సీఎం జగన్ మదిలో ఏముంది ?
ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేది లేదు అంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు.. న్యాయస్థానాల ద్వారా కూడా న్యాయం కోరుతామంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకునే వారికి ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధమంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. అయితే టీడీపీ నేతల ఫిర్యాదు నిజమే అని నిర్ధారణ అయితే.. యూనివర్శిటీకి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ లేకుండా ఎందుకు అడ్మిషన్ ఇచ్చారని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే స్పీకర్ ను కూడా వివరణ కోరుతోరు.. వారి సమాధానం సరైనది కాదు అనిపస్తే.. ఇటు స్పీకర్ పైనా, అటు యూనివర్శిటీపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ పేరుతో స్పీకర్ పదవి నుంచి తొలిగించే అవకాశాలు తక్కువే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, AP Speaker Tammineni Seetharam