AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS PRASHANT KISHORE SENSATIONAL REPORT MAJOR MLAS GET NO SEAT IN NEXT ELECTIONS NGS BK
PK Report: సిట్టింగ్ లకు షాక్..! సగానికిపైగా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో నో సీట్.. ఆ జాబితాలో ఎవరున్నారు?
వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
PK Report: ఏపీలో అధికార పార్టీ సిట్టింగ్ లకు షాక్ తప్పదా..? సగానికిపైగా ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే గెలవరా..? పార్టీ అధినేత జగన్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది..? ఇలాగే ముందుకు వెళ్తే ఓటమి తప్పదా.. అసలు పీకే ఇచ్చిన జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి.
M BalaKrishna, Hyderabad, News18. PK Report: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. కానీ అప్పుడు ఎన్నికల హీట్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి అప్పటి నుంచే ఎవరికి లెక్కలు వారు వేసుకుంటున్నారు. తాజాగా జనసేన (Janasena) అయితే రెండేళ్ల ముందే మేనిఫెస్టో కూడా ప్రకటించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) ముందస్తు తప్పదని.. సీట్లు కేటాయింపులో కూడా దూకుడుగా వెళ్తోంది. ఇటు వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సైతం ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆయన ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్నట్టు టాక్.. దీనికి సంబంధించి వస్తున్న లీకులు సంచలనం అవుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో సగాని పైగా ఎమ్మెల్యేకు సీటు ఇవ్వొద్దని ప్రశాంత్ కిషోర్ సర్వే చేసి మరీ చెప్పేశారట.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆయా ఎమ్మెల్యేకు సీట్లు ఇస్తే డ్యామేజ్ తప్పదని తేల్చి చెప్పేసినట్టు టాక్. ఏపీలోని సింహభాగం సీట్లకి అస్సలు పాతవారికి ఛాన్స్ ఇవ్వొద్దని ఖరాఖండీగా రిపోర్ట్ లో చెప్పినట్టు సమాచారం. రాశేశారట. కారణాలు ఏవైనా.. నెక్స్ట్ ఎన్నికల్లో 70 శాతం మందికి టిక్కెట్ రాదనేది స్పష్టమవుతోంది.
ప్రశాంత్ కిషోర్ గైడె లైన్స్ ను తూ చ తప్పకుండా పాటించే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ 70 శాతానికి టిక్కెట్ ఇవ్వరనే గుబులు వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది అంటే.. అందులో పీకే వ్యూహాలు పని చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పీకేని అధినేత జగన్ గుడ్డిగా ఫాలోఅయిపోతారన్నది వైసీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
తాజాగా పీకే టీమ్ రిపోర్ట్స్ పైనే సీఎం ఆధారాపడుతున్నారని.. సొంత పార్టీ నేతలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులతో పాటు పీకే నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇటీవల సీఎంకు పీకే రిపోర్ట్స్ ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ రిపోర్ట్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాలలో కొత్తవారిని నియమించాలని సూచనలు ఉన్నాయి. ఇటు అనంతపురం నుంచీ అటు శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ ను జగన్ ముందుంచారట పీకే. అంతేకాదు. నియోజకవర్గాల స్థాయిలో ఆ ఎమ్మెల్యే ఏం చేశారు..? ఎంత ఆదరణ ఉంది..? ఏఏ బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి..? ఎంతవరకూ పార్టీకి ప్లస్ అవుతారాు.. లేక మైనస్ అవుతరా..? వంటి పలు అంశాల్ని పరిగణలోకి తీసుకుని సర్వే చేశారట. దీని ఆధారంగా చాలా మంది ఎమ్మెల్యే పీకేకి నచ్చలేదు. దాదాపు జనాల్లో కూడా నామ్ కే వాస్తే గా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చారట. వాళ్లకి ఇక అవకాశం ఇవ్వొద్దని రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారని తెలుస్తుంది.
ఈ రిపోర్ట్ వార్తలకు బయటకు రావడంతో.. ఎమ్మెల్యేల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. తమకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉందా లేదా.. అని ఇప్పటికే ఆందోళన కూడా మొదలైందని ప్రచారం. చాలా వరకూ ఎమ్మెల్యేల్ని జగన్ మోహన్ రెడ్డి పక్కన పెట్టే అవకాశాలు ఎలాగూ ఉన్నాయి. అందుకే అయ్యవారిని ప్రసన్నం చేసుకోవడానికి తమ తమ ప్రయత్నాలు మొదలవుతున్నాయట.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.