Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS PEGASUS ISSUE TENSION FOR TDP CENTRAL GOVERNMENT GREEN SIGNAL TO JAGAN GOVERNMENT NGS

Pegasus: ఏపీలో చంద్రబాబు పెగాసస్ రచ్చ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఆమోదం.. ఏం జరుగుతోంది..

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Pegasus: ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుతం పెగాసస్ వివాదం ప్రకంపణలు రేపుతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రాజకీయంగా ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరుగుతున్నాయి.

    Pegasus:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  పెగాసస్ వివాదం దుమారం రేపుతోంది.  పెగాసస్ సాఫ్ట్ వేర్ (Pegasus Software) వ్యవహారం దేశంలో కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచేందుకు అక్రమంగా ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్షాలు.. కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) పై ఆరోపణలు గుప్పు మన్నాయి. అయితే ఆ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది.  పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. పెగాసస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం పెగాసస్ ను కొనుగోలు చేయాల్సిందిగా ఆఫర్ వచ్చిందని తాము నిరాకరించామని చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు.

    చంద్రబాబుపై పెగాసస్ ఆరోపణలు రచ్చ రచ్చ అవుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఒకే చెప్పడం.. సంచలనంగా  మారింది.    టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్ల కోసం అప్పటి నిఘా విభాగం అధిపతిగా ఉన్న ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు భారీ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్‌ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ 'ఆర్‌టీ ఇన్‌ఫ్లేటబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌'నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారనే విమర్శలు ఉన్నాయి.

    ఇదీ చదవండి : ఏపీ కాబోయే హోమంత్రి రేసులో ఆ నలుగురు..? ఫైర్ బ్రాండ్ కు అవకాశం ఉందా..?

    రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి.కానీ అవేవీ పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయెల్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారనేదానిపై విచారణ కొనసాగుతోంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్‌ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    ఇదీ చదవండి : :ఇద్దరిలో ఎవరు గొప్ప..ట్రిపులార్‌పై ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో చర్చ రచ్చ

    మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. దీనిపై ఆయన వివిధ కోర్టులు, ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తూనే ఉన్నారు. అయితే ఏబీపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర హోంశాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏబీపై నమోదైన కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దీంతో పోలీసులు ఆ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఏబీ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మరోవైపు ఏపీలో చంద్రబాబు ప్రత్యర్ధులపై నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏబీపై సస్పెన్షన్ కు కేంద్రం ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Mamata Banarjee, TDP

    తదుపరి వార్తలు