Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS MP RAMMOHAN NAIDU WILL CONTEST AS A MLA IN NEXT ELECTIONS NGS VSP

Rammohan Naidu: టీడీపీ యువ ఎంపీ మనసు మార్చుకున్నారా..? రామ్మోహన్ నాయుడి ఇంట్లో చర్చ ఏంటి..?

ఎంపీ రామ్మోహన్ నాయుడు మనసు మారిందా?

ఎంపీ రామ్మోహన్ నాయుడు మనసు మారిందా?

Rammohan Naidu: ఎంపీ రామ్మోహన్ నాయుడు డైనమిక్ నేతగా గుర్తింపు ఉంది. ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లాడేస్తారు. అందుకే యువకుడే అయినా టీడీపీలో ఆయనకు అంత గుర్తింపు.. రాజకీయంగానూ పేరున్న కుటుంబం.. అందుకే ఆయనపై ఎప్పుడూ ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. తాజాగా ఆయన మనసు మార్చుకున్నారంటూ ఓ ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  P Anand Mohan, News18, Visakhapatnam.

  Rammohan Naidu: వెనుక బలమైన రాజకీయ కుటుంబం ఉంది. అద్భుతంగా మాట్లాడే టాలెంట్ ఆయన సొంతం. అన్ని భాషలపై పట్టు ఉంది. ఉన్నత విద్యావంతుడు.. అందుకే స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చీరాగానే రెండుసార్లు ఎంపీగా గెలిచారు కింజారపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu). వైసీపీ (YCP) ప్రభంజనంలోనూ ఆయన.. తట్టుకొని నిలబడ్డారు.. గెలుపొందారు. అంటే ఆయనకు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..  మరోసారి లోక్‌సభ బరిలో ఉంటేనే బెటరని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఆయన కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థలకు ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ యువనేత ఇంట్లో మరో చర్చ జరుగుతోందట. ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు టాక్‌. నియోజకవర్గాన్నీ ఎంపిక చేసేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
  మరి.. ఆ యువనేత కోరికను పార్టీ అధినేత మన్నిస్తారా? క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురయ్యే సవాళ్లేంటి?

  శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) రాజకీయాల్లో కింజరాపు ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. మూడు దశాబ్దాలుగా టీడీపీ (TDP)లో వాళ్లది కీలక పాత్ర. టెక్కలితో విడదీయరాని బంధం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడు (erram nayudu) మొదలుకొని.. ప్రస్తుతం అచ్చెన్నాయుడు వరకు ఆ నియోజకవర్గం ఆదరిస్తూనే ఉంది. ఒక్క టెక్కలే కాదు.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కింజరాపు కుటుంబానికి అనుచరులు.. మద్దతుదారులు ఉన్నారు. ఆ కారణంగానే ఈ ఫ్యామిలీ నుంచి ఒకరు ఎంపీగా.. ఇంకొకరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు.

  ఇదీ చదవండి : వరద నీటినీ వదలరా..? మరీ ఇలా ఉన్నారేంట్రా.. వారు చేసిన పని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..? వీడియో

  ఎర్రన్నాయుడు మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్‌ నాయుడు.. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. కానీ ఈసారి ఎంపీగా కాకుండా.. అసెంబ్లీకి పోటీ చేయాలని రామ్మోహన్‌ చూస్తున్నారనే చర్చ జిల్లాతోపాటు.. పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాన్ని రామ్మోహన్‌ నాయుడు ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం
  జరుగుతోంది. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉండే నరసన్నపేట అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట. ఈ ఆలోచనకు రావడానికి కారణం కుటుంబసభ్యుల ఒత్తిడిగా తెలుస్తోంది. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే రాజకీయంగా ఇంకా బలమైన ముద్ర పడుతుందని సూచిస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిస్తే.. రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగొచ్చని.. అనుచరులకు ఇంకా సమయం
  కేటాయించొచ్చని చెబుతున్నారట. సమీకరణాలు కుదిరితే మంత్రి అవ్వొచ్చని చెప్పేస్తున్నారట. 2014 ఎన్నికలకు ముందు వరకు టీడీపీ కేడర్‌ అంతా రామ్మోహన్‌ చుట్టూ తిరిగేదని.. ఆ ఎన్నికల్లో గెలిచి అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక అంతా అటు వైపు వెళ్లిపోయారని కుటుంబంలో చర్చ నడుస్తోందట. రెండుసార్లు ఎంపీగా గెలిచినా రామ్మోహన్‌ నాయుడు సెకండ్‌ లీడర్‌గా మారిపోయారని ఆవేదన చెందుతున్నారట. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

  ఇదీ చదవండి : కటీఫ్ కు వేళాయే..! బీజేపీతో జనసేన బంధం తెంచుకోనుందా..? ముహూర్తం ఫిక్స్..!

  టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. రామ్మోహన్‌ నాయుడు ఎమ్మెల్యేగా బరిలో దిగితే పార్టీలో లేనిపోని ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారట. అచ్చెన్న, రామ్మోహన్‌ ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిస్తే.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో రచ్చ అవుతుందని.. ఏరికోరి అలాంటి తలనొప్పులు చంద్రబాబు ఆహ్వానించబోరని కొందరి వాదన. పైగా ఎంపీగా రామ్మోహన్‌ నాయుడు మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో.. గతంలో ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు విషయంలో ఎలాంటి సూత్రాన్ని అమలు చేశారో.. అదే ఇప్పుడూ కొనసాగిస్తారని సమాచారం.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Rammohan naidu, Srikakulam, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు