Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS MLA ROJA MORE HOPES ON MINSTER BERTH SHE DAILY GOES TO TEMPLES NGS TPT

MLA ROJA: దేవుడు కరుణిస్తాడని.. దేవత వరమిస్తుందని.. బెర్త్ కోసం ఆలయాల చుట్టూ రోజా ప్రదక్షిణ

ఎమ్మెల్యే రోజా ఆధ్యాత్మిక బాట

ఎమ్మెల్యే రోజా ఆధ్యాత్మిక బాట

MLA ROJA: పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు భక్తి ఎక్కువే.. అందుకే సమయం దొరికే చాలు ఆలయాలు చుట్టూ సందర్శిస్తారు. కేవలం ప్రముఖ దేవస్థానాలే కాదు.. మారుమూల అమ్మవారు ఆవహిస్తారు అని తెలిస్తే.. అక్కడికి వెళ్లిపోతారు.. అయితే ఈ భక్తికి అంతటికీ ప్రధాన కారణం కేబినెట్ లో బెర్త్ దక్కించుకోవాలనే కోరిక అంటూన్నాయి వైశీపీ శ్రేణులు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupathi, News18.                                  MLA ROJA:ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి వర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఉగాది (Ugadi)తరువాత ఏ క్షణమైనా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని వైసీపీ (YCP) వర్గాల టాక్.. అయితే ఎవరికి వారు ఇప్పటి నుంచి లాబీయింగ్ మొదలు పెట్టారు. తమకు అవకాశం ఉందో లేదో.. అని ఆరా తీస్తున్నారు. కొంతమంది అధినేత చూపు తమవైపు ఉందని కోటి ఆశలు పెట్టుకున్నారు. మరికొందరైతే తమకు ఉండే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఇక ఎమ్మెల్యే రోజా (MLA Roja)  కొత్త మంత్రుల జాబితా రేసులో ముందు వరుసలోనే ఉన్నారు. ఆమెకు కేబినెట్ బెర్త్ ఖరారు అయ్యిందనే ప్రచారం ఉంది.  ఆమె మాత్రం ఈ బెర్త్ దక్కుతుందని ఎంతో ఆశాభావంతో ఉన్నారు. అంతేకాదు ఎలాగైనా మంత్రి హోదా వచ్చేలా చూడాలి అంటూ దేవుళ్ల ఆశీస్సులు సైతం తీసుకుంటున్నారు. సాధారణంగా ఎమ్మెల్యే రోజాకు భక్తి ఎక్కువే. తీరిక దొరికితే ఆలయాలు సందర్శిస్తారు. కేవలం ప్రముఖ దేవస్థానాలే కాదు.. మారుమూల ప్రాంతాల్లో అమ్మవారు ఆవహిస్తారని తెలిసినా అక్కడ వాలిపోతున్నారు. ఇలా చేస్తోంది అధినేత ఆశీసులు పొందేందుకేనా అని ప్రశ్నిస్తున్నారు.

  అధికారపార్టీ వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా (Chitoor District) నగరి (Nagari) నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యురాలిగా మొదటి టర్మ్‌ విపక్షంలోనే గడిచిపోయింది. గత ఎన్నికలలో వైసీపీ పవర్‌లోకి రావడంతో అధికారపక్షంలో ఉన్నారు. అయితే ఆమెకు ఫైర్‌బ్రాండ్‌ అనే ట్యాగ్‌ ఉండడంతో తప్పుకుండా తొలి కేబినెట్ లోనే మంత్రి వదవి పక్కా అనే ప్రచారం ఉండేది. కానీ సామాజిక, జిల్లా రాజకీయ సమీకరణాల వల్ల ఆమె ఆశ నెరవేరలేదు. ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌ ప్రక్షాళన ఉంటుందని సీఎం జగన్‌ చెప్పడంతో ఆ మాట పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్‌ ఆ దిశగా కసరత్తు ఉంటుందని స్పష్టం చేయడంతో రోజా ఆశలు రెట్టింపు అయ్యాయట.

  ఇదీ చదవండి : కల్తీ సారా మరణాలు నిజం కాదా..? బాబాయ్ గుండు పోటు ఫేక్ కాదా? సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు

  అందుకు అధినేత చూపు తనవైపు పడాలి అంటే దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని రోజా గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. ఆమె చిరకాల కోరిక మంత్రి పదవి కోసం ఇలా గుళ్లు గోపురాల చుట్టూట ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే మొదటి సారే.. పదవి దక్కుతుందని ఆశించి అది దక్కకపోవడం వల్లే అప్పట్లో ఫైర్‌ తగ్గింది. తర్వాత సర్దుకుని గాడిలో పడ్డారు. APIIC ఛైర్‌పర్సన్‌ పదవి వరించింది. గడువు తీరడంతో ఆ పదవిలోకీ ఇంకొకరు వచ్చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తప్ప చేతిలో ఇంకే పదవీ లేదు. కేబినెట్‌లోకి తీసుకొనే ఆలోచన ఉండటం వల్లే మరో నామినేటెడ్‌ పదవి ఇవ్వలేదన్నది రోజా అనుచరుల మాట. ఈ సందర్భంగా అధిష్ఠానం ఆశీసులు దక్కాలని మునుపటిలా టీడీపీపై విరుచుకుపడుతున్నారు రోజా. దైవబలం కూడా ఉండాలని రోజా తిరగని గుడి లేదు.. మొక్కని దేవుడూ లేడు.

  ఇదీ చదవండి : మూడు రాజధానాలకు బిల్లు రెడీ అయ్యిందా..? అసెంబ్లీ ముందుకు వచ్చేది ఎప్పుడు? బొత్స ఏమన్నారంటే?

  ఇటీవల రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ చుట్టేశారు రోజా. ఒక్క గుళ్లే కాదు.. మారుమూల గ్రామాల్లో కొందరికి అమ్మవారు ఆవహిస్తారని.. ఆ సమయంలో ఆశీసులు తీసుకుంటే మేలు జరుగుతుందని తెలిస్తే అక్కడికి వెళ్లిపోయారు. ఆ మధ్య విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలస గ్రామంలో మెరిశారు. అక్కడ దుర్గమ్మను దర్శించుకుని అంబ పలికేతే చాలు.. అధిష్ఠానం ఆశీసులు అందితే చాలన్నట్టుగా పూజలు నిర్వహించారు రోజా. ఇటీవల హైదరాబాద్‌ ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని ఆథ్యాత్మిక తన్మయత్వంలో మునిగి తేలారు ఎమ్మెల్యే రోజా.

  ఇదీ చదవండి : టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు అధిష్టానం హ్యాండ్ ఇస్తుందా..? కారణం అదేనా..?

  ఏదో ఒక దేవుడు లేక దేవత తన మొర ఆలకించక పోతారా.. ఆశ నెరవేరకపోతుందా అని భావించి తెలంగాణలోని మరో పుణ్యక్షేత్రం యాదాద్రిలోనూ ప్రత్యక్షం అయ్యారు రోజా. ఇటీవలే తూర్పుగోదావరిలోని పంచారామ క్షేత్రాలను దర్శించి.. భోళాశంకరుడికి తన కోరికను నివేదించి వచ్చారు రోజా. సామర్లకోట, ద్రాక్షారామాల్లో పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంకేశ్వర స్వామి, త్రిపుర సుందరీ సన్నిధిలో కనిపించారు రోజా. కేబినెట్‌లో చోటు దక్కితే అదే పదివేలన్నట్టుగా ఆదిదంపతులకు ప్రత్యేక పూజలు చేశారు. ఇంతమంది దేవుళ్ల ఆశీస్సులైతే తీసుకున్నారు. మరి వారందరి ఆశీస్సులు ఫలించి.. ఫలితం దక్కుతుందో.. లేక దేవుడు వరమ్మించిన కరుణించని పూజారిలా.. అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, AP News, Nagari MLA Roja, Ycp

  తదుపరి వార్తలు