Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS MLA NANDAMURI BALAKRISHAN FACE PROBLEM WITH HIS PA S IN HINDUPURAM NGS

MLA Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు వారితో తిప్పలు.. మారుస్తున్నా సేమ్ సీన్

బాలకృష్ణ మిస్సింగ్ కంప్లైంట్ (Balakrishna Nandamuri)

బాలకృష్ణ మిస్సింగ్ కంప్లైంట్ (Balakrishna Nandamuri)

MLA Balakrishna: నందమూరి బాలకృష్ణకు వింత సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం సినిమాల పరంగా ఆయన దూకుడుగా ఉన్నారు.. కానీ రాజకీయంగా మాత్రం ఇబ్బందులు తప్పేలా లేదు.. అయితే ఆయన ఎంత కష్టపడుతున్నా.. బాగా నమ్మి బాధ్యత అప్పగించేవారే.. నట్టేట ముంచుతున్నారు.

ఇంకా చదవండి ...
  MLA Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం అఖండ  సినిమా (Akhanda Movie) విజయంతో సినిమాల్లో దూకుడు పెంచారు. ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం ఉండడంతో నటనను ప్రాణంగా ప్రేమిస్తారు. వయస్సు మీద పడినా.. హీరోయిజం చూపించే పాత్రలు చేయడంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. బాలయ్య నటనకు చాలా ప్రాధాన్యం ఇస్తారు.. దాంతో పాటు సెంటిమెంట్ కూడా ఎక్కువ. జాతకాలు.. ముహూర్తాలు, దోషాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. ముహూర్తం లేదంటే.. ఏ పనీ చేయరు. కాలు బయట పెట్టరు. ముహూర్తాలను అంత బలంగా ఆయన నమ్ముతారు. కానీ ఆయన అంతలా నమ్మకం పెట్టుకుంటే.. ఆయనకు పీఏల రూపంలో గండాలు ఎదురవుతున్నాయి. తలనొప్పులు తప్పడం లేదు. ఒకరితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్లేస్ లో మరొకరిని తీసుకున్నా.. మల్లీ గండం తప్పలేదు.

  హిందూపురం (Hindupuram) నుంచి వరసగా రెండుసార్లు బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్‌ సృష్టించారు. అయితే పెద్ద హీరోను కదా అని.. రాజకీయాలను లైట్ తీసుకోరు.. చాలామంది నేతల్లా ఎక్కడో ఉండి.. ఎన్నికలప్పుడు నియోజకవర్గానికి వెళ్లడం కాదు.. కేడర్‌కు అందుబాటులో ఉండటం.. ఎప్పటికప్పుడు హిందూపురం సమస్యలపై అప్‌డేట్‌గా ఉంటారు.

  ఇదీ చదవండి: మేకపాటి గౌతమ్ స్థానం ఎవరికి.? ఆ కుటుంబానికి మంత్రి పదవా? రాజ్యసభ సీటా..? రేపు నెల్లూరుకు సీఎం

  వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో కూడా బాలయ్య భారీ మె మెజారిటీ సాధించారు. ఆ గెలుపునకు బాలయ్య ఇమేజ్.. స్థానికుల్లో ఆయనపై ఉండే నమ్మకమే కారణం. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా.. సరే హిందూపురంపై ఫోకస్‌ చేస్తుంటారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వాటిమీద ఫోకస్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తారు.. జనంతో కలిసి సమస్యపై పోరాటం చేస్తారు. అయితే ఇలా అంతా సవ్యంగానే ఉన్నా.. ఆయనకు సొంత మనుషులతో ఇబ్బంది తప్పడం లేదు. ముఖ్యంగా పీఏలను ఎప్పటికప్పుడు మార్చినా.. ఆయనకు తలనొప్పులు తప్పడం లేదు.

  ఇదీ చదవండి: ఏజెన్సీలో వింత ఆచారం.. ఐదేళ్ల చిన్నారులకు ఓణీల ఫంక్షన్

  సాధారణంగా ఎమ్మెల్యేగా బాలకృష్ణ హిందూపురంలో లేని సమయంలో అక్కడ పార్టీ వ్యవహారాలను PAలు చక్కబెడుతుంటారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలయ్య పీఏగా ఉన్న శేఖర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారారు. ఎన్నోసార్లు ఆయనపై బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు కేడర్‌. చివరకు సొంతపార్టీ నాయకులే శేఖర్‌కు వ్యతిరేకంగా ఆనాడు ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగ విమర్శలు చేశారు కూడా. ఆ గొడవ అప్పట్లో చంద్రబాబు వరకు వెళ్లింది. మొదట్లో ఆ ఆరోపణలను లైట్‌ తీసుకున్న బాలయ్య.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పీఏ శేఖర్‌ను తప్పించేశారు.

  ఇదీ చదవండి: వైసీపీకి విజయమ్మ రాజీనామా చేస్తున్నారా..? అధినేత జగన్ మనసులో మాట అదేనా..?

  చంద్రశేఖర్ తరువాత.. టీచర్‌గా పనిచేస్తున్న బాలాజీని పీఏగా తెచ్చుకున్నారు బాలయ్య. తొలిరోజుల్లో బాలాజీ బాగానే కనిపించినా.. మెల్లగా ఆయనది కూడా సేమ్‌ సీన్‌ అయ్యింది. మళ్లీ విమర్శలు రావడంతో బాలాజీని సాగనంపారు బాలయ్య. అయితే 2019లో మళ్లీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచాక తిరిగి బాలాజీనే PAగా పెట్టుకున్నారు. అప్పుడు కూడా బాలాజీ నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలకు PAతో పెద్దగా పని లేకపోయింది. అయితే ఆయన కూడా పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. అది కూడా ఏపీలో కాకుండా హిందూపురానికి సమీపంలో మరికొందరు వైసీపీ నేతలతో కలిసి కర్ణాటక గౌరిబిదునూరులోని నగిరిగెర బీఎన్‌ఆర్‌ రెస్టారెంట్‌లో పోలీసులకు చిక్కారు.

  ఇదీ చదవండి: ఏపీలో రామ్ చరణ్ కి డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్.. హ్యాపీ బర్త్ డే టూ రామ్ చరణ్ (Twitter/Photo)

  ఏపీలో పేకాట ఆడితే పోలీసులు టార్గెట్‌ చేస్తారని అనుకున్నారో ఏమో.. సేఫ్‌ ప్లేస్‌గా బోర్డర్‌లో ఉన్న కర్ణాటకను అడ్డగా చేసుకున్నారు బాలాజీ. మరి.. కర్నాటక పోలీసులే స్వయంగా దాడి చేశారో లేక.. AP పోలీసులు ఉప్పందించారో కానీ రైడ్‌ జరిగింది. బాలకృష్ణ PA దొరికిపోయారు. ఇక్కడ పోలీసులకు చిక్కింది బాలాజీనే అయినా.. బాలకృష్ణ PA పట్టుబడ్డారన్నదే రచ్చ రచ్చ అయింది. ఇప్పటికే పీఏలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలయ్య.. తాజా వివాదంతో బాలాజీని కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindupuram, Nandamuri balakrishna

  తదుపరి వార్తలు