AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS MINSTER ROJA FIRE ON OPPOSITION PARTIES AND PAWAN KALYAN NGS
Minster Roja: పవన్ దేవుడా..? లేక జ్యోతిష్యుడా..? దమ్ముంటే సింగిల్ గా రావాలి అంటూ రోజా సవాల్
చంద్రబాబుపై రోజా ఫైర్
Minster Roja: ఆంధ్రప్రదేశ్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయం అంతా పొత్తుల చుట్టే తిరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ -జనసేన కలిసే బరిలో దిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో అధికార వైసీపీ ఆ రెండు పార్టీలను ఛాలెంజ్ చేస్తోంది.. తాజాగా మంత్రి రోజా సైతం పవన్ కు సవాల్ విసిరారు.
Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికలు ఉంటాయా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలం ఎంత..? వైసీపీ (YCP)కి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందా..? లేదా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పై ఆధారణ పెరుగుతోందా..? విపక్షాలు పొత్తులతో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా..? ముఖ్యంగా టీడీపీ (TDP) -జనసేన (janasena) కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోతుందా..? గత ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీ, జనసేన బలం పెరిగిందా..? బీజేపీ (BJP) ఒంటరిగా పోటీ చేస్తుందా..? లేక టీడీపీ-జనసేన కూటమితో వెళ్తుందా... ఇంకా కాదంటే పరోక్షంగా అధికార వైసీపీకి సహకరిస్తుందా..? వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోంది. అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయంలో ఉన్నా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే అంశాలపై చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఇవే అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు ప్రశ్నలు సైతం వీటి చుట్టూ తిరుగుతున్నాయి. ఇలా అప్పుడు ఏపీ లో ఎన్నికల వేడి మొదలైంది. ఎవరికి వారు తమదే అధికారం అనే ధీమా ప్రకటిస్తూనే.. ముందుస్తు వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నారు. మరోవైపు అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఫైర్ బ్రాండ్.. మంత్రి రోజా (Minster Roja) .. చంద్రబాబు, పవన్ లకు సవాల్ విసిరారు.
ప్రజల్లో సీఎ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆధరణను చూడలేక.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు గ్రామాల్లో తిరుగుతూ విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. అయినా వీరి మాటలు ఎవరూ నమ్మరని తెలిసినా.. ఇంకా సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు (Chandrababu) , లోకేష్ (Lokesh) లు రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వీరు మారలేదన్నారు. గతంలో కంటే ఈ చంద్రబాబు, లోకేష్ కు ప్రజలు గట్టి బుద్ధి చేబుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే.. ఇలా తమ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకోండి అంటూ కాళ్ల బేరానికి వస్తున్నారని రోజా ఆరోపించారు.
ఇక ఏపీలో గత ఎన్నికల్లో ఒక్క చోట కూడా గెలవలేని పవన్, జగనన్నను ఓడిస్తాననడం సిగ్గు చేటన్నారు. పవన్ ఏమైనా దేవుడా లేక జ్యోతిష్యుడా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయారని, కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం జగన్ తప్పించుకొని పారిపోలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసినా, ఒక్కరోజైనా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా అంటూ రోజా ప్రశ్నించారు.
ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే.. క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో మొన్నటి ఎన్నికల్లో ఆయన్ను తరిమికొట్టారని రోజా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో.. వానపాములు కూడా లేచి బుసలు కొడుతున్నాయని రోజా సెటైర్ వేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో అన్ని హామీల్ని సీఎం జగన్ నెరవేర్చారని, ఇలాంటి సీఎంను ఒక్క ఏపీలో మాత్రమే చూడగలమని అభిప్రాయపడ్డారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.