జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ పాలనపై అదినేత పవన్ నిప్పులు చెరిగారు. విధ్వంసమనే ప్రతిజ్ఞ చేసిన తర్వాతే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభ (Janasena Formation Day) లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రులపై నా మండిపడ్డారు. అలాగే ఏపీలో పోలీసులపై విమర్శలువస్తున్నాయని.. కానీ వారు పడే కష్టాలు తనకుకు తెలుసన్నారు. కేవలం ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తారని పవన్ వారికి మద్దతుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల కోర్టులో నిలుచోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఈ వెల్లంపల్లి వెల్లుల్లి పాయలకి, బంతి.. చామంతి.. అవంతి.. గోడకు కొడితే బంతి అంటూ మంత్రులపై సెటైర్లు వేశారు. ఒక ఐపీఎస్ అధికారికి ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుందా…? అని ప్రశ్నించారు. ఇలా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ఏపీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.
పవన్ పై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటం సభలో ఏపీ, తెలంగాణ నేతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన పవన్ పై పేర్నినాని సెటైర్లు వేశారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం అన్నారు. చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్ ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీ బాగుండాలనేదే పవన్ ఆకాంక్ష అని, అలాగే పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని మంత్రి సెటైర్లు వేశారు.
ఇదీ చదవండి సీఎం మోసం ఖరీదు ఎంతో తెలుసా..? శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ లోకేష్ ఫైర్
ఇవాళ సభలో పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే… కంఠం పవన్ ది, భావం చంద్రబాబుది అన్నట్టుగా ఉందని పేర్నినాని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే పవన్, చంద్రబాబు లక్ష్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పవన్ ఒక్క మాట కూడా అనలేదన్నారు. పవన్ ను నడిపించే శక్తి బీజేపీనే అని, అలా కాకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తుంటే ప్రశ్నించాలి కదా అని మంత్రి అడిగారు. కులాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్… ఇవాళ వైసీపీలో ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది కమ్మ ఓటర్లు, ఎంతమంది సానుభూతిపరులు ఉన్నారో గమనించాలని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని ఇప్పుడే అనిపించిందా? అని పవన్ ను నిలదీశారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయ ఊసరవెల్లిగా పేర్ని నాని అభివర్ణించారు పేర్నినాని. వైసీపీ కార్యకర్తలకు నమస్కారం పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నమస్కారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Janasena, Pawan kalyan