AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS JULY 4TH PRIME MINSTER MODI MEETING IN BHEEMAVARAM PMO OFFICE INVITED TO MEGASTAR CHIRANJEEVI NGS
Megastar Chiranjeevi: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం వెనుక కారణం అదేనా..?
ప్రధాని సభకు చిరంజీవికి ఆహ్వానం
Megastar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇకపై యాక్టివ్ అవుతారా..? నేరుగా తమ్ముడికి మద్దతు తెలుపుతారా..? జనసన మిత్రపక్షం అయిన బీజేపీకి జై కొడతారా..? ప్రధాని మోదీ సభకు చిరంజీవికి ఆహ్వానంతో ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Megastar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. మరోవైపు పొత్తులు ఉంటాయా.. ఉండవా అన్నది సైతం ఆసక్తికరంగా మారింది. టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తు ఉంటుందని కార్యకర్తలు, నేతలు కోరుకుంటున్నారు. కానీ పొత్తులపై రెండు పార్టీల అధినేతల స్వరం మారింది. అయితే ముఖ్యంగా టీడీపీ- జనసేన పొత్తు విషయంలో బీజేపీ అడ్డంకిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ (BJP) తో జనసేనకు పొత్తు ఉంది. టీడీపీ, జననేస, బీజేపీ కూటమిగా బరిలో దిగాలి అన్నది పవన్ ఆలోచన.. కానీ దానికి బీజేపీ ససేమిరా అంటోంది. అలాగని బీజేపీని వదిలో.. టీపీపీతో కలిసి.. వచ్చే ఎన్నికల బరిలో దిగితే.. రాష్ట్రంలో రాజకీయంగా మంచి ఫలితం ఉండొచ్చు.. కానీ బీజపీని దూరం చేసుకుంట.. భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పక పోవచ్చనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పవన్ బీజేపీని కాదని ముందుకు అడుగు వేయడం కష్టమే అని రాజకీయ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో పొత్తులపై రాజకీయంగా అనేక రకాలుగా చర్చ జరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఆసక్తికర పరిణామాం చోటు చేసుకుంటోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించేందుకు టీడీపీ - జనసేన కలిసి పని చేసే వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ రూటు ఏంటనేది తేలాల్సి ఉంది. టీడీపీ మాత్రం బీజేపీ - జనసేనతో కలవాలని కోరుకుంటోంది. కానీ, బీజేపీ మాత్రం టీడీపీతో తిరిగి కలిసేందుకు ఇప్పటి వరకు అయితే సిద్దంగా లేదు. ఏపీలో ఈ సారి ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ చేస్తామని చెబుతోంది. ఈ సమయంలో..సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు జూలై 4నవ తేదీన ప్రధాని మోదీ (Prime Minster Modi) ఏపీ పర్యటనకు వస్తున్నారు. భీమవరంలో అల్లూరు సీతారామ రాజు 125 వ జయంతోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అమృత్ మహాత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి రానున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి కేంద్ర మాజీ మంత్రి.. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపారు. అయితే ఈ ఆహ్వానం వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అల్లూరు సీతారామ రాజు విగ్రహావిష్కరణ జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చిరంజీవికి ఆహ్వానం అందిందని సమాచారం. అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బీజేపీతో-ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. మాజీ కేంద్ర మంత్రిగా ఆయన పర్యాటక శాఖ పర్యవేక్షించారు. ఏపీలో కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు పలువురు ఉన్నారు.
ప్రధాని సభకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించటం ఆసక్తి కరంగా మారింది. కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగియగానే.. చిరంజీవి కాంగ్రెస్ కు పూర్తిగా దూరమయ్యారు. ఆ పార్టీ ముఖ్య నేతలు పలుమార్లు చిరంజీవిని పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని కోరినా..మెగాస్టార్ ఆసక్తి చూపలేదు. పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. గత కొద్ది నెలలుగా ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన తిరిగి తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక, బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు ఢిల్లీలో తన నియామకం ఖరారు కాగానే.. హైదరాబాద్ చేరుకున్న వెంటనే తన మిత్రపక్షం జనసేన అధినేత ను కాకుండా.. ముందుగా చిరంజీవిని కలిసారు. ఇక, బీజేపీ - జనసేన మిత్రపక్షంగా ఉన్నా రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రాధాన్యత వెనుక చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రధాని సభకు ఆహ్వానించటం ద్వారా ఏదైనా వ్యూహం ఉందా.. లేక, రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో ఆహ్వానం పంపారా అనేదానిపై త్వరలో స్పష్టత వస్తుంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.