హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

JD Laxminarayana: మాజీ జేడీ ఆ పార్టీలో చేరుతున్నారా..? ఆయన టార్గెట్ ఎవరు..? పార్టీలో చేరేందుకు కండిషన్లు ఉన్నాయా..?

JD Laxminarayana: మాజీ జేడీ ఆ పార్టీలో చేరుతున్నారా..? ఆయన టార్గెట్ ఎవరు..? పార్టీలో చేరేందుకు కండిషన్లు ఉన్నాయా..?

జేడీ లక్ష్మీ నారాయణ ఆప్ లో చేరుతారా..?

జేడీ లక్ష్మీ నారాయణ ఆప్ లో చేరుతారా..?

JD Laxminarayana: మొన్న ఎన్నికల్లో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి జేడీ ఓడిపోయారు. తరువాత పార్టీకి బై బై చెప్పి.. ఏ పార్టీలోకి చేరలేదు కానీ.. నిత్యం ప్రజల్లో ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన ఆ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం ఉంది. అది ఎంత వరకు వాస్తవం.. ఆయన ఆ పార్టీ చేరాలి అంటే ఎలాంటి కండిషన్లు పెట్టారు..?

ఇంకా చదవండి ...

JD Laxminarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. ఎవరికి వారు 2024 ఎన్నికలే టార్గెట గా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై వ్యూహాల్లో దూకుడు చూపిస్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ పొత్తుల కోసం ఎదురు చూస్తోంది.. అటు బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. అయితే ఈ పార్టీలతో కలిసి టీడీపీ ఉంటుందా.. లేక బీజేపీకి బై చెప్పి పవన్ టీడీపీకి జై కొడతారా అన్నది తేలాల్సి ఉంది. ఏదీ ఏమైనా తాజా పరిస్థితి చూస్తుంటే.. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టింది. తాజాగా పంజాబ్ లో ఏకపక్ష విజయంతో ఆప్ ప్రతిష్ఠ ఒక్క సారిగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీగా ఆప్ రికార్డు సాధించింది. ఇక, తెలంగాణలో ఏప్రిల్ 14న రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలకు ఆప్ సిద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ఆప్ నేత సోమనాధ్ భారతీకి బాధ్యతలు అప్పగించారు. అదే దూకుడు ఏపీలోనూ కొనసాగించే అవకాశాలు కనిపిస్తోంది.

ఏపీలో ఇప్పటికే ఆప్ ఉన్నా..అది పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ ఇటీవల పంజాబ్ ఎన్నిల్లో వన్ సైడ్ విక్టరీ తరువాత ఆ పార్టీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా మరికొన్ని రాష్ట్రాల్లో మంచి విజయం సాధిస్తే... జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పొచ్చు అన్నది కేజ్రీ వాల్ ప్లాన్.. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రస్తుతం పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని కొందరు మాజీ బ్యూరోక్రాట్స్ నేరుగా కేజ్రీవాల్ తో మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో అధికార వైసీపీ -టీడీపీ లకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తి వైపు ప్రజలు చూస్తున్నారని ఆ మాజీ అధికారులు వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో..కేజ్రీవాల్ త్వరలోనే హైదరాబాద్ రానునున్నట్లు సమాచారం. ఈ లోగా ఆప్ లో చేరేందుకు ఏపీకి చెందిన కొందరు మాజీ ఐఏఎస్..ఐపీఎస్ లతో పాటుగా మరి కొందరితో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇక ఏపీ నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆప్ లో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జనసేనకు దూరమయ్యారు. కొద్ది కాలంగా కాపు నేతల సమావేశాల్లోనూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోనూ పాల్గొంటున్నారు. ప్రెజెంట్ ఆయన ఏ పార్టీలోనూ లేరు. కానీ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం టీడీపీ-వైసీపీకి ధీటుగా వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సీబీఐ మాజీ జేడీతో పాటుగా ఏపీకి చెందిన మరి కొందరు మాజీ కీలక అధికారులు.. ప్రస్తుతం ఒక పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తమిళనాడులో కీలక పదవి నుంచి వచ్చిన నేత సైతం ఆప్ లో చేరేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. వీరంతా కేజ్రీవాల్ హైదరాబాద్ పర్యటనలో అధికారంగా ఆప్ లో చేరేందుకు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

మరోవైపు ఎన్నికల్లో తిరిగి 2014 తరహా పొత్తుల కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం తాము తిరిగి టీడీపీతో జత కట్టే అవకాశం లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని శపధం చేసారు. బీజేపీ ముందుకు రాకున్నా.. జనసేన టీడీపీతో కలిసే అవకాశాలు ఉంటాయని టీడీపీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఆప్ ఏపీలో అడుగు పెడితే.. ఆ పార్టీతో టీడీపీ జత కట్టినా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే కేజ్రీవాల్-చంద్రబాబు మధ్య చాలా కాలంగా ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా క్లీన్ ఇమేజ్ ఉన్న ఆప్ ..బలమైన కేడర్ ఉన్న టీడీపీ కలిసి పోటీ చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయనే చర్చ సాగుతోంది. అయితే, దీని పైన పార్టీ ముఖ్యుల మధ్య చర్చలు జరగాల్సి ఉందని తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, JD Lakshmi Narayana