JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు కీలక నేతలు అంతా తమ సీట్లపై ఫోకస్ చేస్తున్నారు. కొందరైతే ముందుగానే ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshminarayana) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. చేయరా..? చేస్తే ఏ పార్టీ నుంచి నిలబడతారా..? వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం (Visakhapatnam) నుంచే పార్లమెంట్‌కు పోటీ చేస్తా..ఏ పార్టీ నుంచి అంటే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన (Janasena) పార్టీ నుంచి విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. పలువురిని కలిశారు.
ప్రస్తుతం ఏపార్టీతో తనకు సంబంధలేనట్లుగానే జేడీ ఉంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ ఇప్పుడే ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈక్రమంలో లక్ష్మీనారాయణ అసలు రాజకీయాల్లో ఉన్నరా? ఉంటే ఏ పార్టీనుంచి? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే పలు అనుమానాలుకొసాగుతున్నవేళ ఆయన క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్త తెలియగానే ఏపార్టీ నుంచి అనే ఆసక్తి ఉంటుంది. కానీ ఆయనమాత్రం నా భావాలకు అనుగుణంగా ఉండే పార్టీవైపే ఉంటానని కానీ స్వతంత్రంగా పోటీ చేసే అవకావం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల వైసీపీ నేత సజ్జల ఏపీ తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోతే బాగుంటుందని..విభజనకు వైసీపీ వ్యతిరేకించింది అంటూ కొత్త రాగం అందుకోవటంపై మీడియా అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు.
ఇదీ చదవండి : విశాఖ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఏ పార్టీ అన్నదానిపై జేడీ క్లారిటీ
రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో నడుస్తోందని ప్రస్తుతం ఆ విషయం గురించి మాట్లాడకపోవటమే మంచిదన్నారు. అన్ని పార్టీలు కూర్చుని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలు రావు అంటూ సూచించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటాను అన్నారు. అయితే మళ్లీ ఆయన జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది కూడా టీడీపీ , జనసేన పొత్తు ఉంటేనే.. ఆ కూటమి తరపున బరిలో దిగే అవకాశం ఉందని కూడా మరో ప్రచారం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, JD Lakshmi Narayana