Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS JANASENA PAC MEMBER NAGA BABU SLAMS ON YCP GOVERNMENT NGS

Nagababu: సమయం లేదు మిత్రమా.. ప్రజల కష్టార్జితాన్నిదోచుకుంటోన్న వైసీపీని సాగనంపండి అంటూ నాగబాబు పిలుపు

జగన్ సర్కార్ కు నాగబాబు వార్నంగ్

జగన్ సర్కార్ కు నాగబాబు వార్నంగ్

Nagababu: జనసేన దూకుడు పెంచింది. మొన్నటి వరకు తెర వెనుకే ఉన్న మెగా బ్రదర్ నాగబాబు నేరుగా రంగంలోకి దిగారు. జనసైనికులతో నిత్యం టచ్ లో ఉంటూ.. వైసీపీపై విమర్శల దాడి పెంచారు.. నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..?

  Nagababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు జనసేన (Janasena) సైతం ఇప్పుడు రంగంలోకి దిగింది. మొన్నటి వరకు తెరవెనుకే జనసేన వ్యవహారాలు చూసిన.. పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు (Konedala Naga babu) నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన ఆయన.. జనసైనికులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్‌ . కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధుల మళ్లింపు, టీటీడీ (TTD)వ్యవహారాలపై వైసీపీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లోంచి సొమ్మును తీసుకోవడంపై సాంకేతిక లోపం అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 12, 918 గ్రామ పంచాయతీల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

  గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను మళ్లించుకోవడంపై తప్పక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  అలాగే భవిష్యత్‌ అవసరాలు, పిల్లల చదువులు, గృహ నిర్మాణాలు, వైద్య ఖర్చులు, భవిష్యత్‌ అవసరాల కోసం నెలవారీ జీతంలో కొంత సొమ్మును పొదుపు చేసుకుంటోన్న ఉద్యోగుల కష్టార్జితం 800 కోట్ల జీపీఎఫ్‌ నిధులను మళ్లించిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన నేత అభిప్రాయపడ్డారు. 

  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై 8 లక్షల కోట్ల రుణ భారాన్ని వైసీపీ ప్రభుత్వం మోపిందని మండిపడ్డారు. సర్పంచుల చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా చేసిన ఘనత కూడా జగన్ సర్కార్ కే చెల్లింది అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా దోచుకోవడం దారుణమని మండిపడ్డారు. తాజా పరిణామాలతో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట అని అభిప్రాయపడ్డారు.

  ఇదీ చదవండి : ఇస్రో మరో సూపర్ సక్సెస్.. PSLV C53 ప్రయోగం విజయంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

  ఒక్క రూపాయి ఉత్పాదన గురించి ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ స్థలాలను విక్రయించడం, అడ్డూ అదుపూ లేకుండా పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ ఖజానాలోని ప్రతి పైసాను దారి మళ్లించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. జగన్‌ రెడ్డి మార్కు పాలనను ప్రజలు ఇప్పటికే గమనించారు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ అంధకారమవుతుంది. సమయం లేదు మిత్రమా అంటూ జనసైనికులకు పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

  ఇదీ చదవండి : అధికార వైసీపీకి మరో షాక్ తప్పదా..? జనసేన వైపు ఆ కీలక నేత చూపు..

  ఏపీకే తలమానికంగా భావిస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే భక్తుల నుంచి అద్దె గదుల కోసం వసూలు చేస్తోన్న రిఫండబుల్ డిపాజిట్లను ఏం చేస్తున్నారో టీటీడీ సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్‌ చేశారు. రిఫండబుల్ డిపాజిట్లలో అద్దె జమ చేసుకోగా మిగిలిన సొమ్మును తిరిగి భక్తులకు చెల్లించడం లేదు. అదేంటి అని అడిగితే బ్యాంకు ఖాతాలకు పంపిస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. దేవుడిపై భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తుల రిఫండబుల్‌ డిపాజిట్లలో అద్దెకు పోగా మిగతా సొమ్మును ఏం చేస్తున్నారో టీటీడీ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి అని నాగబాబు ప్రశ్నించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Mega brother nagababu

  తదుపరి వార్తలు