Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS JANASENA CONVOY READY FOR PAWAN KALYAN DISTRICT TOUR NGS

Pawan New Convoy: జనసేన అధినేత పవన్ కాన్వాయ్ పై రాజకీయం.. అధికార పార్టీ విమర్శలకు ధీటుగా కౌంటర్లు

జనసేన కాన్వాయ్ పై రాజకీయ విమర్శలు

జనసేన కాన్వాయ్ పై రాజకీయ విమర్శలు

Pawan New Convoy: ప్రధాన పార్టీలకు ధీటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇక పూర్తిగా జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు భారీ కాన్వాయ్ ను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ కాన్వాయ్ పైనా విమర్శలు తప్పడం లేదు. అధికార పార్టీ విమర్శలకు అదే స్థాయిలో జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
  Pawan New Convoy: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. దసరా పండుగ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. తనను పార్ట్ టైం పొల్టీషియన్ అని విమర్శలు చేస్తున్నవారికి సమాధానం చెప్పేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. త్వరలోనే సినిమాలకు సుదీర్ఘ విరామం (Long Break for Movies) ఇచ్చి.. పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ (Focus on politics) చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపై జనం లోకి వెళ్లాలని నిర్ణయించారు. దసరా నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లనున్నారు. దానికి సంబంధించి ఏపీ పర్యటన కు నయా కాన్వాయ్ సిద్ధంగా ఉంది. నూతన కాన్వాయ్‌లోని ఎనిమిది స్కార్పియోలకు అర్చకులు ఇవాళ పూజ చేశారు. మంగళగిరి (Mangalagiri) లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో వాహనాలకు పూజ జరిగింది. అక్టోబర్‌ 5న తిరుపతి (Tirupati)నుంచి పవన్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి ఈ సారి పవన్ పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దానికి తోడు సెంటిమెంట్ గా వెంకన్న స్వామి సన్నిధి నుంచి పని ప్రారంభిస్తే కలిసి వస్తుందని భావిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam) తరపున చిరంజీవి (Chiranjeevi) తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇలా అన్ని లెక్కల తరువాత ఆయన తిరుపతి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

  ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జనసేనాని దసరా పండుగ రోజు నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు, సమస్యలు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి నూతన కాన్వాయ్‌ను ఇటీవలే పార్టీ నేతలు బుక్‌ చేశారు. దీనికోసం కోటి 50 లక్షల రూపాయలు వెచ్చించారు. యాత్ర కోసమే కొత్తగా మహీంద్రా బ్లాక్‌ కలర్‌ స్కార్పియోలను కొనుగోలు చేశారు. బ్లాక్ స్కార్పియోలు నిన్ననే జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. జనసేన నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా పవన్‌ నూతన కాన్వాయ్‌ను చూస్తున్నారు.  తాజా రూట్‌మ్యాప్‌ ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్‌ పర్యటన కొనసాగనుంది. కొత్త జిల్లాల లెక్కన కాకుండా.. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఏపీలో పెరుగుతున్న అప్పుల భారంతో పాటు, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు యాత్ర చేపట్టినా పెద్దగా ఫలితం ఉండదని భావిస్తున్న జనసేన నేతలు.. అక్టోబర్‌ నుంచి పవన్‌తో యాత్ర చేయించేలా ప్లాన్ చేశారు. ఈ యాత్రలో నూతన కాన్వాయ్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

  ఇదీ చదవండి : వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో

  అయితే ఈ కాన్వాయ్ పైనా రాజకీయ విమర్శలు తగ్గడం లేదు.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుంటామని ఇచ్చిన హామీతో.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీలో భాగంగానే పవన్ ఈ కాన్వాయ్ ను కొన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో తనకు పార్టీని నడిపించడానికి డబ్బులు లేవని చెప్పిన పవన్.. ఒకేసాని ఇన్ని వాహనాలు ఎలా కొన్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే దానికి ధీటుగానే జనసైనికులు సమాధానం చెబుతున్నారు.. తమ అధినేత ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ లో ఇలాంటివి ఎన్నైనా కొనొచ్చని గుర్తు చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Pawan kalyan

  తదుపరి వార్తలు