హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jansena vs YCP: సీఎంలో రెండు ఫేస్ లు..! అమ్మా.. దొంగ దొంగ అంటూ పవన్ సైటర్లు..?

Jansena vs YCP: సీఎంలో రెండు ఫేస్ లు..! అమ్మా.. దొంగ దొంగ అంటూ పవన్ సైటర్లు..?

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Jansena vs YCP: ఆంధ్రప్రదేశ్ లో జనసేన వర్సెస్ వైసీపీ వార్ తారా స్థాయికి చేరుతోంది. తాజాగా రౌడీ సేన అంటూ జగన్ చేసిన కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. తాజాగా పవన్ అయితే కార్టూన్లతో దొంగా దొంగా అంటూ సెటైర్లు వేశారు. ఇక ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అయితే.. సీఎం కు రెండు ఫేస్ లు ఉన్నాయి అంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Jansena vs YCP: ఆంధ్రప్రదేశ్ (Andrha Pradesh) లో ప్రస్తుతం అధికార వైసీపీ వర్సెస్ విపక్ష జనసేన (YCP vs janasena) మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అని విమర్శిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. తాజాగా జనసైనికులను.. రౌడీ సేన అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. తాజాగా సీఎం విమర్శలకు ధీటుగా స్పందించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. సీఎం జగన్ రౌడీసేన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వ్యంగ్య కార్టూన్లను పోస్ట్ చేశారు.

సీఎం జగన్, వైసీపీ నాయకులు కలిసి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారంటూ పోస్ట్‌లో మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి ప్రత్యర్థి పార్టీని ‘రౌడీ సేన’ అని సీఎం జగన్ దూషించడాన్ని తప్పు పట్టారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరచకాలు ఇవి అనే అర్థం వచ్చేలా.. ఏఏ వర్గాలను ఎలా దోచుకుంటున్నారు..? ఆఖరికి పిల్లలను కూడా వదలని దొంగల్లా.. వైసీపీ నేతలు తయ్యారయ్యారనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. 

పవన్ ఏమన్నారంటే..? అమ్మా! దొంగ.. దొంగ నా చాక్లెట్...’’ అంటూ చిన్న పిల్లల దగ్గర చాక్లెట్ కొట్టేసే దగ్గరి నుంచి.. ‘‘ఏయ్! నీ జేబులో పర్స్ తీయ్.. నగలు.. ఆస్తుల కాగితాలు ఇటు తే..’’ లాంటి దోపిడీల వరకు.. ‘ఏయ్! నీ భూమి డాక్యుమెంట్లు ఎక్కుడున్నాయో చెప్పు.. లేదా..’’ అనే దగ్గరి నుంచి ‘ఏయ్! ముసిలోడా నీ పింఛన్ డబ్బుల, పీఎఫ్, ఎఐసీ పాలసీలు, సేవింగ్స్ ఇటు తే.. లేదా..’’ అనే బెదిరింపుల వరకు అన్నీ దందాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు.

ఇలా పవన్ కార్టూన్లతో సెటైర్లు వేస్తే.. నాదెండ్ల మనోహర్ సైతం ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే.. తమ పార్టీని రౌడీసేన అంటున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

ఇదీ చదవండి : కళ్లు తెరిచి భక్తులను చూస్తున్న లక్ష్మీదేవి.. కార్తీక మాసాన అమ్మవారి మహిమ అంటూ ప్రత్యేక పూజలు

సీఎం జగన్‌లో రెండు ముఖాలు కనిపిస్తున్నాయన్నారు. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. పరదాలు లేకుండా సొంత నియోజకవర్గంలో కూడా సీఎం జగన్ తిరగలేకపోతున్నారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ పాల్గొన్న నర్సాపురం సభలో మహిళ చున్నీలు తీయించడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నల్ల చున్నీలు వేసుకున్న వాళ్ళను అడ్డుకోవడం పోలీసులు తప్పు అని.. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు