Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS INTERNAL POLITICAL FIGHTING BETWEEN YCP LEADERS IN SRIKAKULAM NGS VZM

YCP Politics: అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు..ఇలా అయితే కష్టమే అంటున్న కేడర్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

YCP Political Fight: గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు.. మినహా.. వైసీపీ ప్రభంజనం కనిపించింది. ఎక్కడా తెలుగు దేశం పార్టీ కనీసం పోటీ ఇ్వలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో పరిస్థితి మారుతోందా...? అధికార పార్టీలో విబేధాలతో పార్టీకి నష్టం తప్పదా..?

ఇంకా చదవండి ...
  YCP Politics:  ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ (YCP) ప్రభంజనం కొనసాగింది. విజయనగరం జిల్లా (Vizianagaram District) మొత్తం క్లీన్ స్వీప్ చేయగా.. శ్రీకాకుళం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మినహా అంతా ఫ్యాన్ స్పీడ్ కు ఇతర పార్టీలు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ప్రధాన పార్టీ అయిన టీడీపీ(TDP) సైతం ఫ్యాన్ గాలి ముందు నిలబడ లేకపోయింది. అయితే రెండున్నరేళ్ల తరువాత అక్కడ పరిస్థితి మారిందా..? అంటే అవుననే అంటున్నారు స్థానికులు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్‌లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్‌. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను దూరం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎచ్చెర్ల వైసీపీలోలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌పై కేడర్ మండిపడుతున్నారు. ఎచ్చెర్లతో పాటు లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనియర్ నేతలు వివిధ దఫాలుగా సమావేశం అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. కిరణ్ వ్యవహార శైలికి మాత్రమే తాము వ్యతిరేకమని, పార్టీ అధినాయకత్వంపై తమకు అపారవిశ్వాసం ఉందని ప్రకటించడంతో ఎచ్చెర్ల రాజకీయాలు వేడెక్కాయి.

  స్పీకర్ తమ్మినేని సీతారం (Tammineni Sitaram) సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోనూ అసంతృప్తులు ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య దూరం పెరుగుతుందనే ప్రచారం ఉంది. తమ్మినేనికి వ్యతిరేకంగా పార్టీ నేత కోట గోవిందరావు బ్రదర్స్‌ నిరసన గళం డోస్‌ పెంచారు. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తే.. అక్కడ తమ్మినేని ఫొటోలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు కోట బ్రదర్స్‌. ఆమదాలవలస మండలంలో చింతాడ రవికుమార్‌, పొందూరులో సువ్వారి గాంధీల తీరు కూడా అలాగే ఉందనే ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి: సామాజిక వర్గాల వారిగా జాబితా ఖరారు.. ఏపీలో కొత్త మంత్రులు వీరే..

  టెక్కలి వైసీపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. అక్కడ వైసీపీ అసంతృప్తుల గొడవలు ఉన్నాయి. పేరాడ తిలక్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మధ్య మూడు ముక్కలాట కొనసాగుతోంది. ఆధిపత్యం కోసం ఎవరి ఎత్తులు వారు వేస్తునే ఉన్నారు. ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో చివరికి తామే చిత్తవుతున్నామని వాపోతోంది కేడర్‌. నాయకుల మధ్య సమన్వయ లోపం తమకు శాపంగా మారిందన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట.

  ఇదీ చదవండి: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. గ్యాస్ బుక్ చేసుకోండి.. లక్కీ ఛాన్స్ మీదే

  జిల్లాల్లో ఉన్న ప్రధాన మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అసమ్మతి సంకేతాలు పంపిస్తోంది. ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ చెందిన చాలా వరకు క్యాడర్.. సైకిల్ గూటికి వెళ్లింది. మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పక్క పార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ ప్రచారాల నేపథ్యంలో వైసీపీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Srikakulam, Ycp

  తదుపరి వార్తలు