Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS INTERNAL FIGHT BETWEEN YCP LEADERS FROM ALL DISTRICTS NGS

YSRCP Internal Fight: అధికార పార్టీలో వెన్ను పోట్లతో నష్టం తప్పదు.. ఒకే వేదికపై ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్ ఎవరు..?

అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు

అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు

YSRCP Internal Fight: సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్.. కానీ అధికార వైసీపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేయాల్సి వస్తోంది. అది కేవలం ఒక నియోజకవర్గంలో కాదు.. దాదాపు చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
    YSRCP Internal Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ఎక్కడైనా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం సర్వసాధారణం. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అధికార వైసీపీలో సొంత పార్టీ నేతల మధ్య విబేధాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. ఒకటి రెండు చోట్ల అంటే అది కామన్ అనుకోవచ్చు.. కానీ ఏపీ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP)లో సీనియర్ నేతల కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మంత్రులు, మాజీ మంత్రులు అంతా వర్గ విబేధాలపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యానారాయణ సైతం తన నియోజకవర్గంలో వర్గ విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని, అవి పార్టీకి మంచిది కాదని బొత్స హితవు పలికారు. అయితే కొందరు నాయకులు మాత్రం.. ఎప్పటికీ తానే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదన్నారు. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు అవ్వొచ్చని చెప్పారు. ఇక మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి ధర్మాన సోదరుల మధ్య సైతం విబేధాలు ఉన్నాయి. అధ్యక్షుడి హోదాలో అన్న నిర్వహించే సమావేశాలకు తమ్ముడి మంత్రి ధర్మాన ప్రసాద రావు దూరంగా ఉంటున్నారు. అంతే కాదు తాజాగా ప్రకాశం (Prakasham District), నెల్లూరు జిల్లా (Nellore District) లకు చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించగా.. బాలినేని కామెంట్స్ పై మరో సీనియర్ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఆయన చేసిన కామెంట్స్ నెల్లూరు జిల్లా వైసీపీలో దుమారం రేపుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనను నన్ను బలహీనం చేయాలని కుట్ర చేస్తున్నారంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

    తాజాగా  అంతర్గత విభేదాలు, వెన్నుపోట్లపై ఆ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.. కర్నూలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సొంత పార్టీలో వెన్నుపోట్లపై నోరువిప్పారు. పరోక్షంగా ఎస్వీ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.. కర్నూలు నియోజకవర్గంలో పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కు ద్రోహం చేస్తున్నారు అని మండిపడ్డ సంజీవ్‌ కుమార్.. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో హఫీజ్‌ ఖాన్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. పార్టీలో ఉంటూ కొంత మంది తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. తనపై కుట్రలు చేయాలని చూసినా తాను మాత్రం చిరునవ్వుతో ఓర్చుకుంటానని తెలిపారు..

    తనకు ద్రోహం చేయాలని చూసినా అన్నీ భరిస్తాను, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనతో ఉంటారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కాగా కర్నూలులో పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు.. ఇలా కొందరు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. కొన్ని సందర్భాల్లో ఆ విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరి నేతల వ్యాఖ్యలకు ముందే.. మరో ఎమ్మెల్యే ప్రభుత్వ తీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల బిల్లులుపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

    ఇదీ చదవండి : ఈ ఏడాది రక్షాబంధన్ ఎప్పుడు? ఏ సమయంలో రాఖీ కట్టడానికి మంచింది.. ఈ సారైనా అన్న జగన్ కు షర్మిల రాఖీ కడతారా?

    ప్రకాశం జిల్లా వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా డబ్బులు జమచేయడం వల్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరడగడం లేదంటూ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు తన కార్యకర్తలు అప్పులపాలయ్యారని వారిని ఆదుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని అన్నారు. తన నియోజకవర్గంలో పనులన్నీ వైసీపీ కార్యకర్తలకే అప్పగించానని.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయదపోవడంతో వారంతా అప్పులపాలయ్యారని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆదుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

    ఇదీ చదవండి : అక్కడ వైసీపీ నేతల మధ్య విబేధాలకు ఆయనే కారణమా..? రాజీనామాల పర్వం.. వెనుక మ్యాటర్ అదే!

    ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ఒకవేళ ముందస్తు ఎన్నికలు అనుకున్నా ఇప్పటి వరకు క్లారిటీ లేదు.. కానీ ఇప్పటి నుంచే వైసీపీలో వర్గ పోరు రాజ్యమలతోంది.. టికెట్ తమది అంటే తమదే అంటూ కీలక నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగానే కుట్రలు చేస్తున్నారు. సాధారణంగా ప్రత్యర్థి పార్టీలతో పోరాడాల్సిన నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ నేతలతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇంతలా పరిస్థితి మారినా.. అధిష్టానం స్పందించకపోవడంతో కేడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kurnool, Ycp

    తదుపరి వార్తలు