AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS IN ROW THIRD DAY TDP MLAS SUSPEND IN ASSEMBLY ON JANGAREDDY GUDEM ISSUE NGS
AP Assembly: మూడో రోజూ అసెంబ్లీలో సేమ్ సీన్.. మరోసారి 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
మూడో రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
AP Assembly: వరుసగా మూడో రోజూ ఏపీ అసెంబ్లీలో అదే సీన్.. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ జరపాలి అంటూ.. టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీలో ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో మూడో రోజూ 11 మంది సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజుకూ సేమ్ సీన్ కనిపించింది. జంగారెడ్డి గూడెం ఆకస్మిక మరణాలన్నీ.. ప్రభుత్వ హత్యలే అంటూ టీడీపీ (TDP) సభ్యులు ఆరోపించారు. మూడో రోజూ కూడా స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టారు. వెంటనే చర్చ చేపడితేనే కూర్చుంటా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. హుందగా వ్యవహరించాలని.. స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) కోరినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు.. ముందు జంగారెడ్డి గూడెం అంశంపై చర్చ జరపాలని పట్టు పట్టారు. ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో అసెంబ్లీ నుండి 11 మంది ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న కూడా సభ నుంచి టీడీపీ 11 మంది ఎమ్మెల్యేలను ఒక రోజు సెషన్ కు సస్పెండ్ చేశారు. అంతకుముందు రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఐదుగురు సభ్యులను బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు.
ఏడో రోజు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి టీడీపీ సభ్యుల ఆందోళనలు మొదలయ్యాయి. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతూ వచ్చారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ తరువతే ఇతర అంశాల జోలికి వళ్దామని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అందుకు ప్రభుత్వం నో చెప్పడంతో.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు.. అయితే పదే పదే సభకు అడ్డు తగులుతుండటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేశారు. బెందళాం అశోక్, రామ్మోహన్, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్, సాంబశివరావు, సత్యప్రసాద్‌లను సస్పెన్షన్ చేశారు.
ఇదీ చదవండి : బీజేపీ పవన్ కు ఇవ్వబోయే రూట్ మ్యాప్ ఏంటి? టీడీపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చిందా?
ప్రభుత్వానిది తప్పు లేనప్పుడు చర్చ జరపడానికి ఏంటి సమస్య అని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సభా కార్యక్రమాలు జరగడం ఇష్టం లేకనే టీడీపీ ఇలా ప్రవర్తిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీ సభ్యుల వ్యవహరిస్తున్న తీరు పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు అంటే గురువారం టీడీపీ బండారం బయటపెడతానంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. తాను బయట పెట్టే టీడీపీ బండారాలపై.. రుజువులతో ఎవరైనా సమాధానం చెబితే తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసిరారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.