Ganta Srinivasarao: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు గంటా శ్రీనివసరావు (Ganta Srinivasarao) .. పార్టీలకు అతీతంగా ఆయనకు క్రేజ్ ఉంటుంది.. అలాగే నియోజకవర్గంతో కూడా సంబంధం లేకుండా గెలుపు గుర్రం ఎక్కగలిగే సమర్ధుడు ఆయన.. ఒకప్పుడు ఏపీ రాజకీయాలను తన కను సైగతో శాసించే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాలకు (Uttarandha Politics) ఆయనో పెద్ద దిక్కు.. ఇక సామాజిక పరంగా చూసినా.. ఆయన బలమైన నాయుకుడే అన్నది ఆయా వర్గాల భావన.. అందుకే ఆయన ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. గత కొంతకాలంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)కి దూరంగా ఉంటున్న ఆయన.. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను గంటా శ్రీనివాసరావు కలిశారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు నివాసానికి వచ్చారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), పయ్యావుల కేశవ్ (Payyavula Kesav) లతో మాట్లాడుతూ కనిపించారు. అక్కడ ఉన్న చాలామంది నేతలను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. తరువాత చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించారు.
ఇప్పుడు అదే విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే.. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఆయన పోరాటం చేస్తున్నారు. ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కును.. ప్రైవేటుపరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేసింది. దీంతో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో నేరుగా పాల్గొన్నారు. అక్కడితోనే ఆయన ఆగలేదు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. కనీసం పార్టీ అధినేతకు ముందుగా చెప్పకుండానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజీనామా స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది.. దీంతో టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
ఇలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. కానీ ఇప్పుడు అనూహ్యంగా.. కేంద్రం.. అంటే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి ఆయన మద్దతు పలికారు.. ఎందుకంటే తెలుగు దేశం పార్టీ బహిరంగంగానే.. ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. అధినేత పిలుపు మేరకు.. ఎమ్మెల్యేలు అంతా ఆమెకే ఓటు వేశారు.. అయితే కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన.. ఈ ఎన్నికకు దూరంగా ఉంటారేమో అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి : చిన్నారులను వదలని వైరల్ ఫీవర్లు.. చంటిపిల్లలకూ అదే సమస్య
అంతేకాదు.. అసలు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన చాలాకలం అయ్యింది. అసెంబ్లీ సమావేశాలు.. ఇతర కీలక కార్యక్రమాల్లో సైతం ఆయన ఎప్పుడు పాల్గొనలేదు.. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత.. ఒకటి రెండు సందర్భాల్లో మినహా.. ఇతర ఎమ్మెల్యేలతో ఆయన కలిసింది లేదు.. ఇలా చాలా గ్యాప్ తరువాత అందరితో కలిసి ఓటేయడానికి రావడం కూడా చర్చనీయాశంగా మారింది.
ఇదీ చదవండి: చేతిపంపు నుంచి ఆగకుండా వస్తున్న నీరు.. ఎందుకో తెలుసా..? ఎక్కడంటే..?
గతంలో ఆయన వైసీపీలోకి వెళ్తారని.. జనసేనకు జై కొడతారని.. బీజేపీలో చేరే అవకాశం ఉందని రకరకాల ప్రచారాలు సాగాయి.. కానీ ఆ ప్రచారాలన్నింటికీ ఇక పుల్ స్టాప్ పడినినట్టే.. ఆయన టీడీపీతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్టే.. అంతేకాదు.. అన్ని కుదిరితే మరోసారి కొత్త నియోజకవర్గానికి ఆయనే ఓటేసినట్టు టాక్.. విశాఖ నగరంలో ఉన్న గాజువాక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. మరి జనసేన పొత్తు ఉండి.. పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తే.. గంటా ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ganta srinivasa rao, President Elections 2022, TDP, Vizag