YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్ని రాజకీయ పార్టీల్లోనూ అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఓ వైపు విపక్షాలు అన్నీ ముందస్తు తప్పవని ఎన్నికలకు సిద్ధమవుతుంటే.. అధికార పక్షం సైతం.. ఎన్నికలు ఎప్పుడైనా.. ఎనీ టైం రెడీ అనేట్టు ఉండాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైసీపీ (YCP) ఇకపై ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించింది. ఇలా అన్ని పార్టీలు సమరానికి సై అంటుంటే.. స్థానిక అభ్యర్థులు కూడా తమ బెర్త్ లపై క్లారిటీ కావాలంటూ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే అధికార పార్టీలోనే ఉన్న ప్రత్యర్థి వర్గానికి టికెట్ కేటాయించకూడదనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పటి నుంచి తమకు క్లారిటీ ఇవ్వాలని వినతలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేకు ఈ సారి హ్యాండ్ తప్పదు అనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) నియోజకవర్గం విషయంలో ఊహించని ట్విస్ట్‌లు కనిపిస్తున్నాయి. గన్నవరం సీటు విషయంలో వైసీపీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. అక్కడ పరిస్థితి ఇలా మారడానికి.. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi) అని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో వంశీ టీడీపీ (TDP) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని.. అయితే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు గన్నవరం వైసీపీ శ్రేణులకు చుక్కలు చూపించారని.. కానీ ఇప్పుడు ఆయన అదే పార్టీలోకి వస్తే కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఆయనపై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం.. వంశీకి అధిష్టానంతో ఉండే సంబంధాలే అంటున్నారు. నేరుగా సీఎం జగన్ తో వంశీకి సన్నిహిత సంభంధాలు ఉన్నాయి. అలాగే సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే.. మంత్రి కొడాలి నానితో వంశీ చాలా క్లోజ్.. ఆ పరిచాయాలే ఆయన్ను వైసీపీలోకి వచ్చేలా చేసింది. అంతేకాదు అయనకు ఉన్న పరిచాయాలతో వచ్చే ఎన్నికల్లో ఆయకే సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయం గ్రహించిన స్థానిక వైసీపీ శ్రేణులు మొదటి నుంచి వంశీ రాకను వ్యతిరేకిస్తున్నాయి.
ఇదీ చదవండి : డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రివిలేజ్ నోటీసులు.. లోకేష్ ను అలా అనలేదన్న నారాయణస్వామి
ఇప్పటికే పలు సందర్భాల్లో వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు అన్నట్లు వార్ కనిపించింది. అలాగే వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య రచ్చ జరిగింది.. పైగా వైసీపీ వైపు వచ్చాక వంశీ.. తన అనుచరులకు, టీడీపీ వారికే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని, పదవులు ఇచ్చుకుంటున్నారని, అలాగే నిజమైన వైసీపీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే వారంతా అధిష్టానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలకు వంశీ చుక్కలు చూపిస్తున్నారు అనే టాక్ ఉంది. అందులో భాగంగానే గన్నవరంకు చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు విజయసాయిరెడ్డిని కలిసి.. త్వరగా ఇంచార్జ్‌ని పెట్టాలని కోరారు.. గతంలో వైసీపీ ఓటమి కోసం పనిచేసి టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ, తమను ఇబ్బందిపెడుతున్నారని వారు.. విజయసాయి దగ్గర మొర పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ వంశీకి ఇవ్వొద్దని, యార్లగడ్డ వెంకట్రావ్‌కే ఇవ్వాలని విజయసాయిని కోరారు.
ఇదీ చదవండి : ఆయనకు పోలవరం అంకితం.. అనుకున్న సమయానికి పూర్తి.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
అంతే కాదు.. వల్ల భనేని వంశీకి కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా.? 30 వేలకు పైగా మెజార్టీతో గెలిపిస్తామని విజయసాయి రెడ్డికి లేఖలు రాశారు. అయితే దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. కార్యకర్తలను కలుపుకుపోతానని వైసీపీలోకి వచ్చిన వంశీ, తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది..మరి ఈ విషయంపై జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి..ఎలాగో కొడాలి సపోర్ట్ ఉంది కాబట్టి వంశీకే గన్నవరం సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు..అదే జరిగితే నిజమైన వైసీపీ కార్యకర్తలు వంశీ గెలుపుకు కృషి చేస్తారో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Politics, Gannavaram, Vallabaneni Vamsi, Ycp