Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS EX MINSTER NARAYANA ARREST TAKE POLITICAL TURN BOTSA GAVE CLARITY NGS GNT

Ex Minster Narayana: కేసును లీగల్ గా ఎదుర్కొంటామంటున్న సింధు.. ఎవర్నీ వదలిపెట్టేది లేదన్న మంత్రి బొత్స

నారాయణ అరెస్ట్ వ్యవహారంలో పొలిటికల్ దుమారం

నారాయణ అరెస్ట్ వ్యవహారంలో పొలిటికల్ దుమారం

Ex Minster Narayana Arrest Case: మాజీ మంత్రి.. సీనియర్ టీడీపీ నేత నారాయణ అరెస్ట్ పై పొలిటికల్ హీట్ నెలకొంది. అయితే ఈ కేసును లీగ్ లానే ఎదుర్కొంటామని ఆయన కుటుంబం చెబుతోంది. మరోవైపు పేపర్ల లీకేజ్ విషయంలో ఎంత పెద్దవారినైనా విడిచిపెట్టమని చెబుతోంది.. అంతేకాదు నారాయణపై ఒకటికి రెండు కేసులు పెట్టింది సర్కార్.

ఇంకా చదవండి ...
    Ex Minster Narayana Arrest Case: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పేపర్ల లీకేజ్ (10th Exam Paper leakage) వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ (Political) తీసుకుంది. మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత నారాయణ (Narayana) ను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే చిత్తూరు పోలీసులు నిర్ధారించారు.. పది పేపర్ల లీకేజ్ నరాయణ సంస్థల నుంచే జరిగిందని.. ఈ కేసులో వైస్ ప్రిన్సిపల్ (Vice Principal) సహా, ఇతర సిబ్బందిని అరెస్ట్ చేయడం జరిగిందని.. వారి మంగ్మూలం తరువాతే నారాయణను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. మరోవైపు తమ తండ్రి అరెస్ట్ అక్రమం అంటున్నారు నారాయణ కుటుంబ సభ్యులు.. తండ్రి అరెస్ట్ ను లీగల్ గా ఎదుర్కొంటామని.. ఆయన కూతురు సింధు (Narayana Daughter Sindhu) అన్నారు. తమ విద్యా సంస్థల (Educational Institute) తరుపున కాసేపట్లో ప్రకటన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల తరువాత.. మెజిస్ట్ర్రేట్ ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో నారాయణపై మరో కేసు కూడా నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.. అమరావతిలో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో చంద్రబాబు ఏ1 (Chandrababu a1), నారయణ ఏ2 (Narayana a2) లపై కేసు నమోదైంది.

    నారాయణ అరెస్ట్ తో ఏపీలో పొలిటికల్ మంటలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసుపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మంత్రి బొత్స కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అన్ని జిల్లాల్లో పోలీసులు విచారణ చేపట్టారన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదన్నారు. ఎక్కడ లీకయ్యాయో పోలీసులు విచారణ చేస్తున్నారన్నారు. తప్పు చేసిన ఎవరినైనా అరెస్ట్ చేస్తారని.. చట్టం, పోలీసులు వారి పని వారు చేసుకెళ్తారని బొత్స స్పష్టం చేశారు. తప్పు చేయకపోతే నారాయణ నిరూపించుకోవాలన్నారు.

    ఇదీ చదవండి : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ లో ట్విస్ట్.. తెలంగాణ పోలీసుల అభ్యంతరం.. గంటల వ్యవధిలో మరో కేసు

    ఇదే సమయంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అక్రమాలు జరగకపోతే ఎందుకు కేసు పెడతారని బొత్స ప్రశ్నించారు. మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో రాజధాని అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు. ల్యాండ్ పూలింగ్‌ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. సోమవారం నాడే సీఐడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని శేఖర్, A5గా అంజనీకుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పోలీసులు పేర్కొన్నారు. వీరిపై 120B, 420 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP 10th Exams 2022, AP News, AP Politics, Botsa satyanarayana, Narayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు