Political Jumping in AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే నెల నుంచి అన్ని పార్టీలు ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ మాజి మత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2019 ఎన్నికల్లో గెలుపొందినా.. ఆయనే ఉత్తరాంధ్ర కీలక నేత, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) . 2019లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా నెగ్గినా.. ఆయన రాజకీయాలు, పార్టీకి దూరంగా ఉంటూనే వచ్చారు. వైసీపీలో జాయిన్ అవుతున్నట్టు జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఆ పార్టీలో నేతలు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగింది. బీజేపీలో చేరుతారని.. జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన సైలెంట్ గా నే ఉన్నారు.. సొంత పార్టీకి దూరంగా ఉన్నారు. సడెన్ గా ఆయన ఒక్కసారి యాక్టివ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత గంట గట్టిగా మోగించారు. అది కూడా అలాంటి ఇలాంటిది కాదు.. స్టేట్ పాలిటిక్స్‌ని షేక్ చేసే వైబ్రేషన్‌తో యాక్టివ్ అవుతున్నారు. త్వరలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయని.. ఇంట్రస్టింగ్ హింట్ ఇచ్చారు. మరి ఆయన మాటలు ఎంత వరకు నిజం అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఏపీలో చాలామంది సీనియర్ లీడర్లు.. మాజీ మంత్రులు ఉన్నారు.. కానీ వాళ్లలో ఏది పడితే అది ఆయన మాట్లాడరు. సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. గంటా శ్రీనివాసరావు ఏదైనా మాట్లాడారు అంటే..? కచ్చితంగా దాని వెనుక పెద్ద రీజనే ఉంటుందన్న టాక్ ఉంది. అందుకే ఇప్పుడు ఆయన మాటలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అదే సమయంలో వైసీపీలో పరిణామాలు కూడా జోరుగా మారుతున్నాయి. అసమ్మతి గళాలు పెరుగతున్నాయి. దీంతో గంటా వ్యాఖ్యలు నిజమేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఇదీ చదవండి : పోరాడే శక్తి ఇవ్వాలని దుర్గమ్మకు చంద్రబాబు పూజలు.. స్వయంగా కలిసి విష్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే
2024 ఎన్నికల కోసం గంటా మాంఛి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. కొడితే.. గట్టిగా కొట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. కేబినెట్ విస్తరణ తర్వాత.. వైసీపీలో ఒక్కసారిగా చెలరేగిన అసమ్మతి సెగలు, అలకలు, కోపాలు, తాపాలు.. గంటాని బాగానే అట్రాక్ట్ చేశాయనే చర్చ మొదలైంది. దాంతో.. తన స్టైల్లో రాజకీయం మొదలుపెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత.. ఈ మధ్యే టీడీపీ ఆఫీస్‌కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు శ్రీనివాసరావు.. కొన్ని పాయింట్స్‌ని టచ్ చేశారు. సీనియర్ మంత్రి బొత్స.. ఎందుకు జగన్ రివ్యూకు హాజరు కాలేదని.. ఓ క్వశ్చన్ రైజ్ చేశారు. అంతేకాదు.. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి.. జిల్లాకు మంత్రి పదవి ఎందుకివ్వలేదని మరో పాయింట్ లాగారు.
గంటా చెప్పిన రెండు పాయింట్స్ వెనుక విషయం చాలానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. అది అవంతికే ఇవ్వాలి. మరి.. ఆయన్ని సైడ్ చేసి గుడివాడ అమర్నాథ్‌కి ఎందుకిచ్చారు? ఇక.. ఉత్తరాంధ్రలో బిగ్ పొలిటికల్ ఫిగర్‌గా ఉన్న బొత్స ప్రస్తావన తెచ్చి.. ఆయన మీదా ఓ లుక్ వేశారని తెలుస్తోంది. బయటకు.. వీళ్లిద్దరి పేర్లు మాత్రమే చెప్పినా.. గంటా పర్సులో లిస్టులో ఇంకా పెద్దదే ఉందనే చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో.. వైసీపీ నుంచి తెలుగుదేశం వైపు భారీ స్థాయిలో వలసలు ఉంటాయని.. అందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారనే.. హింట్ ఇచ్చారు.
ఇదీ చదవండి : వైసీపీలో విడుదల రజనీకి పెరుగుతున్న ప్రధాన్యం.. యువ మంత్రికి ఎందుకంత ప్రయారిటీ
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటాకు గట్టి పట్టుంది. 2008లో ప్రజారాజ్యం పార్టీ కోసం.. ఆ 3 జిల్లాలను చూసుకున్నది.. కాసుకున్నది ఆయనే. 2014లో టీడీపీలోకి జంప్ అయి.. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. గత ఎన్నికల టైంలోనూ.. సైకిల్ దిగి.. ఫ్యాన్ గాలి కింద రిలాక్స్ అవుదామనుకున్నారు. కానీ.. సహచరుడు అవంతి శ్రీనివాసరావు.. ఆయన కంటే ముందే వైసీపీలో చేరిపోయారు. గంటా చేరకుండా.. అడ్డుపుల్లలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు.. మళ్లీ అవంతికి మంత్రి పదవి పోవడంతో.. ఇద్దరి మధ్యా మళ్లీ పాత స్నేహం చిగురించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ganta srinivasa rao, TDP, Ycp