Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS EX MINSTER AYYANNA PATRYDU RELEASE AUDIO TAPE OF MINSTER AMBATI RAMBABU NGS VSP

Minster Audio..!: మంత్రి రాసలీలకు ఇదిగో ఫ్రూఫ్.. ఆడియో రిలీజ్ చేసిన టీడీపీ.. వాయిస్ ఎవరిది..?

మంత్రి అంబటి వర్సెస్ మాజీ మంత్రి అయ్యన్న

మంత్రి అంబటి వర్సెస్ మాజీ మంత్రి అయ్యన్న

Minster Audio..!: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసిరా ఆడియో వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అది కూడా మంత్రి వ్యాఖ్యలు అంటూ టీడీపీ ఆ ఆడియోను రిలేజ్ చేసింది. అసలు ఆ ఆడియోలో ఎముందో వినండి.. మరి ఆ ఆడియోపై మంత్రి ఏమంటారు..?

  P Anand Mohan, Visakhapatnam, News18

  Minster Audio..!:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పొలిటికల్ హీట్ (Political Heat) మరికాస్త పెరిగింది. తెలుగు దేశం (Telugu Desam), వైఎస్ఆర్సీపీ (YSRCP) నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరిపోతోంది. మొన్నటి వరకు మాటల రూపంలో ఒకర్ని ఒకరు తిట్టుకున్న నేతలు.. ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu), మంత్రి అంబటి రాంబాబు (Amabati Rambabu)ల మధ్య ట్విట్టర్ వార్ ముదిరింది. ముఖ్యంగా కాంబాబు అంటూ అయ్యన్న పాత్రుడు విరుచుకు పడుతున్నారు. వీరి మధ్య ట్విటర్ వార్ మొదలవ్వటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల అయ్యన్న పాత్రుడు ఓ ట్వీట్ చేశారు.. సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సాప్ లో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ (YouTube Channel Anchor) మెసేజ్ చేసిందని.. ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ కాంబాబు రిప్లే ఇచ్చాడని, త్వరలో ఆ వివరాలు ప్రపంచాని తెలియజేస్తానంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత రోజే.. ఆడదైతే చాలు సొంత కూతురుని కూడా వంకర చూపులు, వంకర మాటలు మాట్లాడే రకం ఆయన అంటూ..? త్వరలోనే యుట్యూబ్ యాంకర్ సీఎంను కలబోతుంది.. ఇక మీ చీటీ చినిగినట్టే అంటూ మరో ట్వీట్ చేశారు.. అయితే దీనిపై అంబటి కూడా ఘాటుగా స్పందిస్తూ.. ట్విట్టర్ లో కూతలు కూసిన ఆయన ఎందుకు సైడ్ అయ్యారు అంటూ మండిపడ్డారు..

  అయితే తాజాగా సంచలన ఆడియో వీడియోలు విడుదల చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. కాంబాబు నీ బూతు పురాణం సిఎం కి చేరింది. భర్తరఫ్ చేస్తారో అన్ని తెలిసే కదా ఈ పదవి ఇచ్చాం అనుకుంటారో వాళ్ళ ఇష్టం. ఎవరెవరికి మెసేజ్ చేశారో తనకు తెలుసని.. అది తెలిసి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం అది నా వాయిస్ కాదు...నా మెసేజ్ కాదు అనడం కామనే గా అంటూ కొట్ చేశారు.  ఇదీ చదవండి : రాత్రికి రాత్రే కోటేశ్వరుడైతే..? నీటికోసం వెళ్లిన గొర్రెల కాపరికి ఏం దొరికిందో చూడండి..

  గతంలో కూడా ఆ మంత్రిపై ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా మాట్లాడిన‌ట్లు కొన్ని ఆడియో టేపులు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి త‌న‌వి కావంటూ ఆయ‌న వాటిని ఖండించారు. మార్ఫింగ్ చేసి వాటిన విడుద‌ల చేశార‌ని, నేర‌స్తుల‌ను ప‌ట్టుకొని శిక్షించాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న మంత్రిగా లేరు.

  ఇదీ చదవండి : : వైవీ సుబ్బారెడ్డిపై కోపమా..? ఇద్దరి మధ్య చెడిందా..? స్వారూపానంద వ్యాఖ్యలకు అర్థమేంటి?

  బట్టబయలు చేస్తాను.. బద్దలుకొడతాను.. బర్తరఫ్ చేయిస్తానని.. ట్విట్టర్ లోనే మొరుగుతూ సైడ్ అయిపోయిన సన్నాసి ఎవడు ? అంటూ ట్వీట్ చేశారు మంత్రి అంబటి.. అక్కడితోనే ఆగకుండా..? చింతకాయ పచ్చడి అయ్యిందని.. వంకాయ గాళ్ళు చాల మంది బయల్దేరారు.. ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా కట్టకట్టుకుని వచ్చినా పీకేది లే ! అంటూ మరో ట్వీట్ చేశారు..  ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ తాస్థాయికి చేరింది.. రాజకీయం దగ్గర నుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా వీరి మధ్య వార్ వెళ్ళింది. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన విషయంపై రాంబాబు చేసిన ట్వీట్‌కి గాను.. కాంబాబు అంటూ అయ్యన్నపాత్రుడు బదులిచ్చినప్పటి నుంచి ఈ ట్విటర్ వార్ వ్యక్తిగతంగా మలుపు తీసుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. తాజా ఆడియో టేపులపై.. మంత్రి అంబటి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. అసలు ఆ ఆడియో తనదో   కాదో ఆయనే చెప్పాలి..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, AP Politics, Ayyannapatrudu, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు