Ex Minister Anil Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితలు చూస్తుంటే..? త్వరలోనే ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అందుకే అన్ని పార్టీలు ఇప్పటికే జనం బాట పట్టాయి. అధికార వైసీపీ గడప గడపకు ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా కేబినెట్ భేటీ (Cabinet Meeting) లో సీఎం జగన్ (CM Jagan) సైతం.. మంత్రులంతా రెండు రోజులు సచివాలయాల్లో ఉండి.. మిగిలిన ఐదు రోజులు ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బాదుడే బాదుడు పేరుతో.. జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇక కౌలు రైతులకు నగదు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . ఇదే సమయంలో వైసీపీ (YCP) వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయడం ఫిక్స్ అయ్యింది. ఇక ప్రతిపక్షాల కూటమి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జనసేన (Janasena) -బీజేపీ (BJP) ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ (TDP)తో కలసి జనసేన వెళ్తుందనే ప్రచారం ఉంది. కానీ బీజేపీ దానికి నో అంటోంది. ముఖ్యంగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే..? పొత్తు అవసరం అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ మంత్రులు, నేతలు మాత్రం దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలని సవాల్ విసురతున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి నిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో.. లేక వేరేవాళ్లతో కలిసి ఉంటారో..? కుదిరితే పెళ్లి చేసుకుంటారో వాళ్ల ఇష్టమని.. అది వైఆసఆర్సీపీ కి సంబంధం లేదన్నారు. ఎవరు.. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) ఇక ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు. అయినా 75 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏం ఉద్దరిస్తాడని ప్రశ్నించారు. ముస్లిలను జగన్ కు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కేవలం కలలు కనడం.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప.. ఆయన చేసేది ఏం లేదన్నారు అనిల్. నెల్లూరు నగరం వెంకటేశ్వర పురంలో పర్యటించిన అనిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి : మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు..! కోర్టులో చిత్తూరు పోలీసుల పిటిషన్
సీఎం జగన్ ను నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌లు (Pawan Kalyan) పొత్తుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టలేకే ఈ పొత్తులు అని అభిప్రాయపడ్డారు. జగన్ అంటే భయపడుతున్నారని అందరికీ అర్ధమవుతోందని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. విద్యార్థులకు సంబంధించి పేపర్ లీక్ అయితే కేసు కట్టకూడదా.. కేసులు కడితే కక్ష అంటారా.. అంటూ ప్రశ్నించారు. చిన్న ఆరోగ్య సమస్య కారణంగా తాను ఇంకా గడప గపడకూ కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. గతంలో ఎప్పుడు రెండున్నర ఏళ్ల క్రితం NRC ఇష్యూ సందర్భంగా జరిగిన పాత వీడియో ను తీసుకొచ్చి గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో అనిల్ ముస్లింలు తరిమికొట్టారని టిడిపి జనసేన అబద్ధపు ప్రచారం చేస్తోంది అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Chandrababu Naidu, Pawan kalyan